ఇంటర్ ఫలితాల అవకతవకలపై త్రిసభ్య కమిటీ రిపోర్ట్ ..

ఇంటర్ ఫలితాల అవకతవకలపై త్రిసభ్య కమిటీ రిపోర్ట్ ..
x
Highlights

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో తలెత్తిన సమస్యలపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఇంటర్ ఫలితాల అవకతవకలు, సాంకేతిక సమస్యలపై...

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో తలెత్తిన సమస్యలపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఇంటర్ ఫలితాల అవకతవకలు, సాంకేతిక సమస్యలపై త్రిసభ్య కమిటీ రిపోర్టు ప్రభుత్వానికి ఇచ్చింది. 10 పేజీల రిపోర్టును విద్యాశాఖ కార్యదర్శి బి. జనార్ధన్ రెడ్డికి అందించారు. దీనిపై విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బోర్డు తీసుకోవాల్సిన అంశాలను రిపోర్ట్ లో పొందుపరిచామని టీఎస్ పీఎస్సీ ఎండీ వెంకటేశ్వర్ రావు పేర్కొన్నారు. మరోసారి ఇలాంటి సంఘటను జరగకుండా ఉండేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలో చెప్పామంటున్న వెంకటేశ్వర్ రావు. జిల్లా కేంద్రాలలో రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు సంబంధించిన క్వాలిటీ వర్క్‌ ఉండేలా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఇక రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు సంబంధించిన తేదీని పొడిగించలేదన్నారు. రోజు వారిగా ఎన్ని పేపర్లు రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌లు అయ్యాయో తెలిపే వివరాలను ఎప్పటికప్పుడు అందజేయనున్నట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు సెక్రటరీ అశోక్‌ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories