Top
logo

పోలీసుల ఆంక్షలు.. వెనక్కి తగ్గని పందెం రాయుళ్లు

పోలీసుల ఆంక్షలు.. వెనక్కి తగ్గని పందెం రాయుళ్లు
X
Highlights

పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా పందెం రాయుళ్లు వెనక్కు తగ్గలేదు. యధేచ్చగా కోడి పందాలు జోరుగా సాగాయి. మూడు రోజులుగా కోస్తా జిల్లాలో వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి.

పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా పందెం రాయుళ్లు వెనక్కు తగ్గలేదు. యధేచ్చగా కోడి పందాలు జోరుగా సాగాయి. మూడు రోజులుగా కోస్తా జిల్లాలో వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి. సంక్రాంతి పండగ మూడు రోజులు ఎక్కడ చూసినా సంకలో కోడిపుంజు పట్టుకుని పందెం రాయుళ్లు హల్ చల్ చేసిన దృశ్యాలే దర్శనమిచ్చాయి. సంక్రాంతి పండగ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలు జోరుగా కొనసాగాయి. కోడి పందాలు నిర్వహిస్తే చూస్తూ ఊరుకోబోమని పోలీసులు హెచ్చరించినా, ఎక్కడా పట్టించుకున్న దాఖలాలు లేవు. భీమవరం, ఉండి, ఏలూరు, నరసాపురం, కాకినాడ, పిఠాపురం, ఆకివీడు తదితర ప్రాంతాల్లో జరిగిన పందాల్లో వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి.

కోడి పందాలు కాసేందుకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల నుంచి కూడా పందెం రాయుళ్లు వచ్చి మకాం వేశారు. భోగి, సంక్రాంతి, కనుమ మూడురోజులు కోడి పందాలపై పెద్ద ఎత్తున బెట్టింగ్ లు జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి పందెం రాయుళ్లు తరలివచ్చారు. కోనసీమలోని పలు ప్రాంతాల్లోనూ జోరుగా కొనసాగిన కోడి పందాల్లో.తెలంగాణా ,కర్నాటక, ఇతర ప్రాంతాల నుండి పందెం రాయుళ్ళు తరలివచ్చారు. వందకు పైగా బరుల్లో పందాలు, భారీగా బెట్టింగ్ లు కాశారు. మరో వైపు కోడి పందాల బరుల వద్ద యదేచ్ఛగా పేకాట, గుండాట, మద్యం అమ్మకాలు కొనసాగుతున్నా పోలీసులు చేతులెత్తేశారు.

Next Story