జోరుగా పందేలు.. కోట్లలో చేతులు మారిన ధనం

cock fight
x
cock fight
Highlights

ఏపీలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. బరిలో పందెం కోళ్లు కత్తులు దూస్తున్నాయి. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కోడి పందాలపై పెద్ద ఎత్తున బెట్టింగ్‌లు జరుగుతున్నాయి.

ఏపీలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. బరిలో పందెం కోళ్లు కత్తులు దూస్తున్నాయి. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కోడి పందాలపై పెద్ద ఎత్తున బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. కోర్టు ఆంక్షలు, పోలీసుల హెచ్చరికలను కూడా లెక్కచేయడం లేదు. కోట్లు చేతులు మారుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు, కర్ణాటక నుంచి పందెం రాయుళ్లు తరలివచ్చారు.

కత్తులు కట్టిన కోళ్లు బరిలోకి దిగాయి. మొదటిరోజే ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 350కోట్లకు పైగా చేతులు మారాయి. ఈ ఏడాది పశ్చిమ గోదావరి జిల్లాను తలదన్నే రీతిలో కృష్ణా జిల్లాల్లోనూ వందలాది బరుల్లో వేల సంఖ్యలో పందేలు సాగాయి. ఆడా మగా, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కోడి పందేలు చూసేందుకు జనం ఎగబడుతున్నారు. కత్తి కట్టి పందేలు వేయవద్దని, డింకీ పందేలు వేసుకోవచ్చని పోలీసులు చేసిన సూచనలను బేఖాతరు చేస్తూ డింకీ పందేలే అంటూ నేతల దన్నుతో కత్తులు కట్టి నిర్వహించారు.

సంస్కృతి, సంప్రదాయం మాటున పందెం కోళ్లకు కత్తులు కట్టారు. కాయ్‌ రాజా కాయ్‌ అంటూ పెద్ద ఎత్తున పందెం రాయుళ్లు లక్షల్లో పందేలు కడుతూ బరుల్లో హల్‌చల్‌ చేస్తున్నారు. పందేలను తిలకించేందుకు పెద్ద ఎత్తున కార్లలో వస్తున్నారు. పేకాట సైతం భారీ స్థాయిలో సాగుతోంది. పందేల నిర్వహణకు మాత్రమే మామూళ్ల రూపంలో కోట్లలో వసూళ్లు జరుగుతున్నాయి. పందేలను వీక్షించడానికి నిర్వాహకులు ప్రత్యేక గ్యాలరీలు కూడా ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories