ఎవరూ ఊహించని విధంగా జగన్ వేవ్‌...ఫ్యాన్ తిరిగిన తిరుగుడికి...

ఎవరూ ఊహించని విధంగా జగన్ వేవ్‌...ఫ్యాన్ తిరిగిన తిరుగుడికి...
x
Highlights

ఉత్తరాంధ్రలోనే కాదు తెలుగుదేశానికి అత్యంత బలమున్న కోస్తాంధ్రలోనూ ఫ్యాన్ దూసుకుపోయింది. ఫ్యాన్ తిరిగిన తిరుగుడికి తెలుగుదేశం పార్టీ అడ్రస్‌ గల్లంతైంది....

ఉత్తరాంధ్రలోనే కాదు తెలుగుదేశానికి అత్యంత బలమున్న కోస్తాంధ్రలోనూ ఫ్యాన్ దూసుకుపోయింది. ఫ్యాన్ తిరిగిన తిరుగుడికి తెలుగుదేశం పార్టీ అడ్రస్‌ గల్లంతైంది. కోస్తాంధ్రలోని 89 స్థానాల్లో 73 సీట్లను గెలుచుకుని వైసీపీ తిరుగులేని విజయం సాధించింది. తూర్పుగోదావరి మొదలుకొని నెల్లూరు వరకు ప్రతి జిల్లాలోనూ వైసీపీ ప్రభంజనం కొనసాగింది.

వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీకి పట్టున్న రాయలసీమలోనే కాదు తెలుగుదేశానికి అత్యంత బలమున్న కోస్తాంధ్రలోనూ వైసీపీ ప్రభంజనం సృష్టించింది. ఎవరూ ఊహించని విధంగా జగన్ వేవ్‌ కొనసాగింది. ఫ్యాన్ తిరిగిన తిరుగుడికి తెలుగుదేశం పార్టీ గల్లంతైంది. కోస్తాంధ్రలోని మొత్తం 89 స్థానాల్లో 73 సీట్లను గెలుచుకుని వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. టీడీపీ కేవలం 16 స్థానాల్లో గెలిచి పరువు నిలుపుకుంది.

2014లో తెలుగుదేశానికి అండగా నిలిచిన ఉభయగోదావరి జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌ సునామీ కొనసాగింది. తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ సంచలన విజయం సాధించింది. మొత్తం 19 స్థానాలున్న జిల్లాలో, మెజారిటీ సీట్లను గెలుచుకుని ప్రభంజనం సృష్టించింది. 2014లో కేవలం 5 స్థానాలకు మాత్రమే పరిమితమైన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ ఈసారి 12కి పైగా సీట్లలో విజయం సాధించి దాదాపు క్లీన్ స్వీప్ చేసింది.

గత ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసిన పశ్చిమగోదావరి జిల్లాలో ఈసారి ఫలితం పూర్తిగా రివర్సైంది. 2014లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయిన వైసీపీ ఈసారి జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 15 స్థానాల్లో 14 సీట్లను గెలుచుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సునామీ సృష్టించింది.

ఉభయగోదావరి జిల్లాల తర్వాత టీడీపీకి అత్యంత పట్టున్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ ఫ్యాన్ గట్టిగా తిరిగింది. ముఖ్యంగా కృష్ణాజిల్లాలో తెలుగుదేశంపై పైచేయి సాధించింది. కృష్ణాజిల్లాలో మొత్తం 16 స్థానాలుండగా, గత ఎన్నికల్లో కేవలం 5 చోట్ల మాత్రమే గెలిచిన వైసీపీ ఈసారి 13 నియోజకవర్గాల్లో జయకేతనం ఎగురవేసింది.

ఇక టీడీపీకి బలమున్న మరో జిల్లా గుంటూరులోనూ జగన్ గాలే బలంగా వీచింది. గత ఎన్నికల్లో కేవలం 4 సీట్లు మాత్రమే గెలుచుకున్న వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు 12కి పైగా స్థానాల్లో ఘనవిజయం సాధించింది. 2014లో 13 సీట్లలో జెండా ఎగరేసిన టీడీపీ ఈ ఎన్నికల్లో కేవలం మూడంటే మూడే స్థానాల్లో గెలిచి చతికిలపడింది.

నెల్లూరు జిల్లాలో మరోసారి వైసీపీ సత్తా చాటింది. 2014లో 7 సీట్లు గెలుచుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ‌... ఈసారి మరింత ఘనవిజయం సాధించింది. మొత్తం 10 స్థానాల్లో 10 సీట్లను గెలుచుకుని రికార్డు సృష్టించింది.

ఇక ప్రకాశం జిల్లాలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం కొనసాగింది. గత ఎన్నికల్లో 6 స్థానాల్లో మాత్రమే విజయం సాధించిన వైసీపీ ఈసారి 8 సీట్లను తన ఖాతాలో వేసుకుని మంచి విజయం సాధించింది. 2014లో ఐదు చోట్ల గెలిచిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు 4 స్థానాలను కైవసం చేసుకుని కొంతలో కొంత పరువు నిలుపుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories