క్షుద్రపూజలపై జగన్ సర్కార్ మళ్లీ విచారణ ?

క్షుద్రపూజలపై జగన్ సర్కార్ మళ్లీ విచారణ ?
x
Highlights

ఆంధ్రప్రదేశ్ లో తిరుమల తర్వాత అంతటి ప్రాశస్త్యం ఉన్న విజయవాడ కనకదుర్గమ్మ గుడిపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇక్కడ ఏళ్లుగా తిష్టవేసి, ప్రజాధనాన్ని...

ఆంధ్రప్రదేశ్ లో తిరుమల తర్వాత అంతటి ప్రాశస్త్యం ఉన్న విజయవాడ కనకదుర్గమ్మ గుడిపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇక్కడ ఏళ్లుగా తిష్టవేసి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినవారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇటీవల బాధ్యతలు స్వీకరించే ముందు అమ్మవారిని దర్శించుకున్నారు. అప్పుడే ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలను కొందరు అధికారులు ఏపీ సీఎం దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. అన్నదానం, ఉపాలయాలు, ఈవో కార్యాలయం, అమ్మవారి గర్భగుడి వంటిచోట కొందరు ఉద్యోగులు ఏళ్లుగా పాతుకుపోయారు. ఇక్కడి సిబ్బంది ఈవోకు అనుకూలంగా, వ్యతిరేకంగా రెండు గ్రూపులుగా వ్యవహరిస్తున్నారు. దీనికితోడు కనకదుర్గమ్మ ఆలయంలో గతేడాది డిసెంబర్ 26న అర్ధరాత్రి క్షుద్రపూజలు జరిగాయని వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి కొందరిపై వేటు వేసిన అప్పటి ప్రభుత్వం, విచారణ కమిటీని నియమించింది. తాజాగా వైఎస్ జగన్ ఇప్పుడు ఈ వ్యవహారంపై తాజాగా మళ్లీ విచారణకు ఆదేశించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories