Top
logo

స్వఛ్చందంగా కాన్వాయ్ నిలిపి అంబులెన్స్‌కు దారిచ్చారు..

స్వఛ్చందంగా కాన్వాయ్ నిలిపి అంబులెన్స్‌కు దారిచ్చారు..
X
Highlights

అంబులెన్స్ లో ప్రయాణిస్తున్న పేషంట్ ను సమయానికి ఆసుపత్రికి తరలించేందుకు తెలుగు రాష్ర్టాల ఉమ్మడి గవర్నర్...

అంబులెన్స్ లో ప్రయాణిస్తున్న పేషంట్ ను సమయానికి ఆసుపత్రికి తరలించేందుకు తెలుగు రాష్ర్టాల ఉమ్మడి గవర్నర్ స్వచ్ఛందంగా కాన్వాయ్ నిలిపివేయగా భద్రతను సైతం పక్కకు పెట్టారు తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు. కుయ్‌‌కుయ్‌మంటూ వస్తూ ట్రాఫిక్ లో చిక్కుకుకున్న అంబులెన్స్‌కి దారిచ్చారు అంబులెన్స్ వెళ్లే వరకు రోడ్డు పక్కనే తమ వాహానాలు నిలుపుకున్నారు. హైదరాబాద్ సిటీలో ప్రయాణం అంటేనే నరకం. అడుగడుగునా ట్రాఫిక్ కష్టాలు. అలాంటిది.. నడి రోడ్డుపై ట్రాఫిక్ లో చిక్కుకున్న అత్యవసర వైద్య సేవల కోసం వినియోగించే అంబులెన్స్ వాహనానికి గవర్నర్ నర్సింహన్ తో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వచ్ఛందంగా కాన్వాయ్స్‌ను నిలిపి దారిచ్చారు. రాజ్ భవన్ టూ ఖైరతాబాద్ జంక్షన్ మార్గంలో ఈ సన్నివేశం చోటు చేసుకుంది.

రంజాన్ సందర్భంగా గవర్నర్ ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్ తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, మంత్రులు, అధికారుల‌కు రాజ్‌భ‌వ‌న్‌లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. అయితే ఈ విందులో పాల్గొనేందుకు గవర్నర్‌తో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ సంస్కృతి భవనం వద్దకు వెళుతుండగా పోలీసులు రాజ్‌భవన్‌కు వెళ్లే దారిలో ట్రాఫిక్‌ను నిలిపివేశారు. అదే స‌మ‌యంలో ఓ అంబులెన్స్ కుయ్‌, కుయ్ మని శ‌బ్దం చేసుకుంటూ రాజ్‌భ‌వ‌న్ రోడ్డు మీదుగా ఖైర‌తాబాద్ జంక్ష‌న్ వైపు వెళ్తుంది. ట్రాఫిక్ క్లియర్ చేయడంలో భాగంగా అంబులెన్స్ నిలిపి వేశారు పోలీసులు.

ట్రాఫిక్ లో అంబులెన్స్ నిలిచిపోవడాన్ని గమనించిన తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు తమ భద్రతను సైతం పక్కకు పెట్టారు. గవర్నర్ తో పాటు ఇద్దరు సీఎంలు స్వఛ్చందంగా కాన్వాయ్ ను నిలిపి వేసి అంబులెన్స్ కు దారిచ్చారు. సంకాలంలో అంబులెన్స్ ఆసుపత్రికి చేరుకోవడానికి సహకరించారు. ఇదే సమయంలో సీఎంల కాన్వాయ్ ను ముందుకు పోనిచ్చి ఆ తర్వాత అంబులెన్స్ కు అనుమతి ఇచ్చినట్లయితే పరిస్థితి మరో విధంగా మారిపోయేది. ట్రాఫిక్ లో చిక్కుకుని కదలడానికి వీల్లేకుండా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. గవర్నర్ నర్సింహన్ ఇద్దరు ముఖ్యమంత్రులను ఆదర్శంగా తీసుకుని ట్రాఫిక్ లో చిక్కుకున్న అంబులెన్స్ వాహనాలకు దారిచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి అండగా నిలిచేందుకు బాధ్యతాయుతంగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


Next Story