Top
logo

మరో 15 రోజుల్లో యాదాద్రికి వస్తా : కేసీఆర్

మరో 15 రోజుల్లో యాదాద్రికి వస్తా : కేసీఆర్
X
Highlights

యాదాద్రి పుణ్య క్షేత్రాన్ని అధ్భుతంగా తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్ అన్నారు. యాదాద్రి క్షేత్రాన్ని...

యాదాద్రి పుణ్య క్షేత్రాన్ని అధ్భుతంగా తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్ అన్నారు. యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించిన కేసీఆర్ ఆలయ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న పనుల పురోగతిని సమీక్షించారు. ఆలయ అభివృద్ధి పనులను ‌ఏరియల్ సర్వే ద్వారా వీక్షించారు. వెయ్యి ఎకరాల్లో టెంపుల్ సిటీ నిర్మిస్తున్నట్లు చెప్పిన కేసీఆర్ ప్రపంచంలోనే యునిక్ టెంపుల్‌గా యాదాద్రి రూపొందుతోందని సంతోషం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత కేసీఆర్‌ యాదాద్రికి రావడం ఇదే తొలిసారి. ప్రధానాలయం, వ్రత మంటపం, శివాలయం పనుల పురోగతిని ఆయన ఇవాళ పరిశీలించారు. యాదాద్రి పనుల్లో ఇంకా వేగంగా జరగాలని సూచించారు. యాదాద్రి అభివృద్ధి కోసం మరో 70 కోట్ల రూపాయల్ని మంజురు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయంలో చిన్న చిన్న మార్పులు చేయాలన్న కేసీఆర్ త్వరలో చిన జీయర్ స్వామిని కలిసి చర్చిస్తానని అన్నారు. మరో 15 రోజుల్లో యాదాద్రికి వస్తానన్నారు.

Next Story