లక్ష రూపాయల రుణమాఫీపై ప్రభుత్వం దృష్టి...ఈ సారి రుణమాఫీ ఎలా ఉండబోతుంది?

CM KCR
x
CM KCR
Highlights

ఎన్నికల హామీలపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. ప్రధానంగా రుణమాఫీపై కసరత్తు చేస్తున్నారు. ఈ సారి ఒకేసారి రుణమాఫీ చేయాలా లేదా విడతాలవారీగా చేయాలి అనేదానిపై తీవ్రంగా ఆలోచిస్తున్నారు. మరోవైపు రుణమాఫీ కటాఫ్ తేదిపై రైతుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.

ఎన్నికల హామీలపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. ప్రధానంగా రుణమాఫీపై కసరత్తు చేస్తున్నారు. ఈ సారి ఒకేసారి రుణమాఫీ చేయాలా లేదా విడతాలవారీగా చేయాలి అనేదానిపై తీవ్రంగా ఆలోచిస్తున్నారు. మరోవైపు రుణమాఫీ కటాఫ్ తేదిపై రైతుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.

రెండవ సారి అధికారంలో వసై రైతులకు లక్ష రూపాలు రుణమాఫి చేస్తామని ప్రకటించారు సీఎం కేసీఆర్. అంతేకాక టిఆర్ఎస్ మ్యానిఫెస్టులో పెట్టారు. అయితే రైతు రుణమాఫి ఏప్పటి నుండి అమల్లోకి వస్తూందనే దానిపై ఇంకా క్లారిటి రాలేదు. మరో వైపు సహకర ఎన్నికల ఫిబ్రవరి లో జరగుతున్నానేపథ్యంలో డిసెంబర్ 31,2108 వరకు రైతు బ్యాంకుల్లో లక్ష రుపాలయు రుణం తెుచ్చుకున్నా రైతులకు ఓటు హక్కు కల్పిస్తామని ప్రకటించన నేపథ్యంలో డిసెంబర్ 31,2018 నే రైతు రుణమాఫి కటాఫ్ డే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన లక్ష రూపాయల రుణమాఫీపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. ఈ సారి రుణమాఫీ ఎలా చేయాలి అనేదానిపై ముఖ‌్యమంత్రితో పాటు అధికారులు కసరత్తు చేస్తున్నారు. డిసెంబర్ 31,2018 వరకు బ్యాంకుల్లో లక్ష రూపాయల వరకు రుణం తీసుకున్న రైతులకు సహకార ఎన్నికల్లో ఓటు వేసే వీలుండడంతో రుణమాఫీపై దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది.

తొలిసారిగా 2014 అధికారంలోకి వచ్చిన టీఆర్ ఎస్ ప్రభుత్వం రుణమాఫీని ప్రకటించింది. 35 లక్షల 29 వేల మంది రైతులకు 16,125 కోట్ల రూపాయలను మాఫీ చేసింది. నాలుగు దఫాల్లో రుణమాఫీ చేయడంతో ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సీఎం కేసీఆర్ ఈ సారి ఒకేసారి రుణమాఫీ చేయాలా లేదా పాత పద్ధతిలో పోవాలా అనేదానిపై తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఈ సారి రుణాలు తీసుకున్న రైతుల సంఖ్య 40 లక్షలు వుండగా, 20 వేల కోట్ల రూపాయలకు పైగా బకాయిలు ఉన్నట్లు తెలిసింది.

మరోవైపు రుణమాఫీ కటాఫ్ తేదిపై రైతుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇక రబీ సీజన్ రుణాల పంపిణీ పూర్తికాకపోవడంతో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తేదిని కటాఫ్ గా తీసుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సహకార ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కటాఫ్ తేదిని డిసెంబర్ 31,2018ను తీసుకోనున్నట్లు సమాచారం. రుణమాఫీకి వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయిస్తారా అనే దానిపై ఇంకా స్పష‌్టత రాలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories