Top
logo

న్యూఇయర్‌లో కేసీఆర్ ప్రాజెక్టుల బాట

CM KCR
X
CM KCR
Highlights

నూతన సంవత్సర తొలి రోజునే సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల బాట పట్టనున్నారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మాణాల అన్నింటిని తానే స్వయంగా క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. జనవరి 1వ తేదిన‌ కాళేశ్వరం ప్రాజెక్టు, 2న ఎస్సారెస్పీ పునర్జీవన పథకం పనులను పరిశీలించనున్నారు. అనంతరం హైదరాబాద్ చేరుకొని 3, 4 తేదీల్లో కేసీఆర్ ప్రాజెక్టుల అన్నింటిపైనా ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహిస్తారు.

నూతన సంవత్సర తొలి రోజునే సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల బాట పట్టనున్నారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మాణాల అన్నింటిని తానే స్వయంగా క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. జనవరి 1వ తేదిన‌ కాళేశ్వరం ప్రాజెక్టు, 2న ఎస్సారెస్పీ పునర్జీవన పథకం పనులను పరిశీలించనున్నారు. అనంతరం హైదరాబాద్ చేరుకొని 3, 4 తేదీల్లో కేసీఆర్ ప్రాజెక్టుల అన్నింటిపైనా ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహిస్తారు.

జనవరి 1న హైదరాబాద్ లో జరిగే హైకోర్టు చీఫ్ జస్టిస్, ఇతర న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు. అనంతరం బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు పనుల సందర్శనకు బయలు దేరతారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు, పంపుహౌజుల నిర్మాణాలను ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. అదే రోజు సాయంత్రం కరీంనగర్ చేరుకుని, అక్కడే బస చేస్తారు.

జనవరి 2న ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎస్.ఆర్.ఎస్.పి.కి నీరందించే శ్రీరామసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవన పథకం పనులు జరిగే ప్రాంతాలను సందర్శిస్తారు. రాజేశ్వర్ రావు పేట, రాంపూర్ లలో నిర్మాణంలో ఉన్న పంపుహౌజు పనులను పరిశీలిస్తారు. అనంతరం హైదరాబాద్ చేరుకుంటారు.

సీఎం కేసీఆర్ కంటే ఒక రోజు ముందుగానే ఈ నెల 31న రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ రిటైర్డు ఇంజనీర్ల బృందం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు, పంపుహౌజుల నిర్మాణ పనులను పరిశీలిస్తుంది. అదే రోజు సాయంత్రం రిటైర్డు ఇంజనీర్లు ముఖ్యమంత్రికి ప్రాజెక్టు పనుల పురోగతిని వివరిస్తారు.

జనవరి 1న రిటైర్డు ఇంజనీర్ల బృందం పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టు పనులు జరిగే ప్రాంతాలను సందర్శిస్తుంది. అక్కడ పనులను పర్యవేక్షిస్తారు. జనవరి 2న రిటైర్డు ఇంజనీర్ల బృందం సీతారామ ప్రాజెక్టు పనులు జరిగే ప్రాంతాలను సందర్శిస్తారు. అనంతరం హైదరాబాద్ చేరుకుంటారు. మూడు రోజుల పాటు కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, డిండి, సీతారామ ప్రాజెక్టులను సందర్శించే తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల బృందం 2వ తేదీ సాయంత్రం హైదరాబాద్ చేరుకుని ముఖ్యమంత్రికి వివరాలు అందిస్తారు. 3 లేదా 4వ తేదీల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని ప్రాజెక్టులపై ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహిస్తారు.

రెండో దశ ప్రాజెక్టుల సందర్శనలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాశేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మిడ్ మానేరు నుంచి కొండ పోచమ్మ సాగర్ వరకు జరుగుతున్నవివిధ పనులను పరిశీలించడానికి పర్యటిస్తారు. పాలమూరు-డిండి, సీతారామ ప్రాజెక్టులను కూడా సందర్శిస్తారు. ఈ ప్రాజెక్టుల పర్యటన తేదీలను త్వరలో ప్రకటిస్తారు.


Next Story