Top
logo

జాబితాపై ఆశావహుల్లో ఉత్కంఠ

జాబితాపై ఆశావహుల్లో ఉత్కంఠ
X
Highlights

తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు కావడంతో ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొన్నది. ఎవరెవరికి మంత్రివర్గంలో...

తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు కావడంతో ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొన్నది. ఎవరెవరికి మంత్రివర్గంలో బెర్త్ దక్కుతుందన్నదానిపై జోరుగా చర్చ కొనసాగుతోంది. పలువురు ఎమ్మెల్యేలు తమకు కేబినెట్ లో చోటు ఖాయమనే అంచనాలో ఉన్నారు. తొలి దఫాలో 8 నుంచి 10 మందికి అవకాశం ఇవ్వొచ్చని భావిస్తున్నారు కేబినెట్ పూర్తి స్థాయి విస్తరణ మాత్రం లోక్ సభ ఎన్నికల తర్వాత ఉంటుందని పాత., కొత్త నేతలతో మంత్రివర్గం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

బడ్జెట్ సమావేశాలకు మూడు రోజుల ముందు కేబినెట్ విస్తరించనున్నారు సీఎం కేసీఆర్. ఎవరెవరిని కేబినెట్ లోకి తీసుకోవాలన్న దానిపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. కేబినెట్ లో చోటు దక్కని వారికి ఇతర పదవులు అప్పగించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్., చీఫ్ విప్., పార్లమెంటరీ కార్యదర్శి పదవులతో భర్తీ చేసే అవకాశాలున్నాయి. ఈ నెల 19న విస్తరించే మంత్రి మండలిలో చోటు లభించే ఎమ్మెల్యేలకు ఈనెల 18న అధికారికంగా సమాచారం అందనుంది.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోపే మంత్రులతో పాటు ఇతర పదవుల పంపకాన్ని పూర్తి చేసే అవకాశం ఉందని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. మంత్రివర్గంలో అవకాశం కోసం పార్టీ సీనియర్ ఎమ్మెలతో పాటు కొత్తగా అసెంబ్లీలో అడుగుపెట్టిన వారు సైతం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సామాజిక సమీకరణలు ఉమ్మడి జిల్లాలను ప్రాతిపదికగా చేసుకుని మంత్రివర్గ కూర్పు ఉంటుందని అధికారికంగా సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో 19వ తేదీన చేపట్టే మంత్రివర్గ విస్తరణలో ఎవరికి స్థానం దక్కనుందో వేచిచూడాల్సిందే.

Next Story