జూన్ తర్వాత కొత్త రెవెన్యూ చట్టం తీసుకువస్తాం: కేసీఆర్

జూన్ తర్వాత కొత్త రెవెన్యూ చట్టం తీసుకువస్తాం: కేసీఆర్
x
Highlights

జూన్ తర్వాతే దేశం ఆశ్యర్య పోయే విధంగా కొత్త రెవెన్యూ చట్టం తీసుకు వస్తామన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. నిర్మల్ లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న కేసీఆర్...

జూన్ తర్వాతే దేశం ఆశ్యర్య పోయే విధంగా కొత్త రెవెన్యూ చట్టం తీసుకు వస్తామన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. నిర్మల్ లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న కేసీఆర్ కేంద్ర సర్కార్ పై విరుచుకపడ్డారు. రెవెన్యూ భూముల సమస్య పరిష్కరిస్తామన్నారు. నెల రెండు నెలలు ఓపిక పట్టండి. రైతులు ఎమ్మార్వో కార్యాలయాల చుట్టు తిరిగే పని లేకుండా చేస్తామని చెప్పారు. పసుపు బోర్డు కోసం ఐదేళ్లు అడిగినా కేంద్రం పట్టించుకోలేదని వందల కొద్ది ధరఖాస్తులు పెట్టినా కేంద్రం నుంచి స్పందించలేదని ఆరోపించారు. ఎన్నికలు రాగానే హిందువులు, ముస్లింలు అంటూ మతవిద్వేశాలు రెచ్టగొడుతున్నారు తప్ప ప్రజలకు ఏం మేలు చేశామని చెప్పలేకపోతున్నారని విమర్శించారు. బీజేపీ పార్టీ గత ఎన్నికల్లో 10 కోట్ల మందికి ఉగ్యోగాలిస్తమని చెప్పింది. కోటి మందికన్నా ఉద్యోగాలు ఇచ్చిందా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. బ్లాక్‌మనీ తీసుకొచ్చి ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని మోదీ అన్నడు.చాలా కష్టపడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నమని ఐదేళ్ల క్రితం కరెంట్ విషయంలో ఆగమాగం ఉండే. ఇపుడు కరెంట్ కష్టాలు తీరాయి. ఇపుడు 24 గంటల కరెంట్ ఇస్తున్నం. ఇపుడు దేశంలో అత్యధిక తలసరి వినియోగం మనదేనని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories