తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు...సీనియర్లకే...

తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు...సీనియర్లకే...
x
Highlights

తెలంగాణ క్యాబినేట్ విస్తరణకు సీఎం కేసీఆర్ ముహూర్తం ఖరారు చేశారా వారం రోజుల్లోనే మినీ క్యాబినెట్ ఫాం కాబోతుందా అంటే టీఆర్ఎస్ వ‌ర్గాల నుంచి అవున‌నే...

తెలంగాణ క్యాబినేట్ విస్తరణకు సీఎం కేసీఆర్ ముహూర్తం ఖరారు చేశారా వారం రోజుల్లోనే మినీ క్యాబినెట్ ఫాం కాబోతుందా అంటే టీఆర్ఎస్ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధ‌నం వస్తోంది. ఇప్పటికే మంత్రి పదవులు ఎవరికి కేటాయించాలో కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. 20 నుంచి 30 మంది ఆశావాలు పోటీలో ఉన్నా ఎనిమిది మందికి మాత్రమే మంత్రులుగా ప్రమోషన్ లభించున్నట్లు వినికిడి. ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. మంత్రి పదవి దక్కించుకునేందుకు ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ మంత్రి వర్గవిస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది ఇప్పటికే తనతో పాటు హోంమంత్రి మహమూద్ అలీతో కేబినెట్ ఏర్పాటు చేశారు గులాబీ బాస్ కేసీఆర్. మరికొంత మందిని కేబినెట్ లోకి తీసుకునేందుకు కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 7న మంత్రివర్గాన్ని ప్రకటించనున్నట్లు ప్రగతి భవన్ లోనూ ఇటు అధికార వర్గాల్లోనూ చర్చించుకుంటున్నారు. ఇప్పుడే పూర్తి స్థాయి మంత్రివర్గవిస్తరణ కాకుండా మినీ కేబినెట్ నే ప్రకటించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. నలుగురు లేదా ఎనిమిది మందితో మంత్రివర్గాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి.

మరో వైపు మంత్రివర్గంలో అవకాశం దక్కించుకునేందుకు పావులు కదుపుతున్న ఆశావాహులకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలువకుండా ప్రగతి భవన్ కే పరిమితం కావడం కూడా మంత్రివర్గ విస్తరణకు సమయం ఆసన్నమైందనే సంకేతాలు వెలువడుతున్నాయి. మరో వైపు జిల్లా సామాజిక వర్గాల ఆధారంగా సీనియర్లకే అవకాశం ఉండవచ్చన్న చర్చ పార్టీ నేతల్లో జరుగుతోంది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి లేదా జోగు రామన్నలో ఒకరికి నిజామాబాద్ జిల్లా నుంచి వేముల ప్రశాంత్ రెడ్డి పేరు వినిపిస్తోంది కరీంనగర్ జిల్లా నుంచి మాజీ మంత్రి ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ లో ఒకరికి అవకాశం దక్కే అవకాశాలున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా నుంచి నిరంజన్ రెడ్డి లేదా శ్రీనివాస్ గౌడ్ వరంగల్ జిల్లా నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు, రెడ్యానాయక్, దాస్యం వినయ్ భాస్కర్ పేర్లు వినిపిస్తున్నాయి. హరీష్ రావుకు మంత్రివర్గంలో చోటు దక్కకపోతే ఎర్రబెల్లికి అవకాశం కల్పిస్తారన్న చర్చ సాగుతోంది.

ఇక నల్లగొండ జిల్లా నుంచి జగదీష్ రెడ్డి పేరు వినిపిస్తుంది. గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి మంత్రి ప‌ద‌వి ఆశిస్తున్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి మంత్రి పదవి దక్కొచ్చనే చర్చ జరుగుతోంది. ఖ‌మ్మం జిల్లాకు ప్రాతినిథ్యం ఉండ‌క‌పోవ‌చ్చని భావిస్తున్నారు. ఖ‌మ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజ‌య్ మంత్రి ప‌దవిని ఆశిస్తున్నారు. హైదార‌బాద్ నుంచి మాజీ మంత్రి శ్రీనివాస్ యాద‌వ్‌, రంగారెడ్డి జిల్లా నుంచి కోడంగ‌ల్ ఎమ్మెల్యే ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డికి ఛాన్స్ లభించే అవకాశాలున్నాయి. మ‌హిళా ఎమ్మెల్యేల‌కు అవ‌కాశం ఉంటుందా లేదా అనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది.

మంత్రివర్గంలో తప్పక చోటు దక్కుతుందని ఎదురు చూస్తున్న ఆశావాల్లో ఎవరెవరికి బెర్త్ కన్ఫామ్ అవుతుందో తెలియక ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. గులాబీ బాస్ మదిలో ఏముందో అర్ధం కాక ఎప్పుడు కేబినెట్ విస్తరిస్తారో అన్నది సస్పెన్స్ నేతలను వెంటాడుతోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories