Top
logo

ప్రధాని టార్గెట్‌గా కేసీఆర్ విమర్శలు...

ప్రధాని టార్గెట్‌గా కేసీఆర్ విమర్శలు...
Highlights

ప్రధాని నరేంద్ర మోడీ టార్గెట్‌గా సీఎం కేసీఆర్‌‌ పంచ్‌ డైలాగులు విసిరారు. ఇప్పటి వరకు జాతీయ పార్టీలపై విమర్శలు...

ప్రధాని నరేంద్ర మోడీ టార్గెట్‌గా సీఎం కేసీఆర్‌‌ పంచ్‌ డైలాగులు విసిరారు. ఇప్పటి వరకు జాతీయ పార్టీలపై విమర్శలు చేసిన ఆయన నేరుగా ప్రధానిపై విమర్శలు సంధించారు ? ఇదేనా మీరు చేసిన అభివృద్ధి అంటూ ఘాటూగా ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారో చెబుతారా ? అంటూ ప్రశ్నించారు. ఏముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారంటూ సూటిగా ప్రశ్నించారు .

తెలంగాణకు కారు, రాష్ట్ర భవిష్యత్‌కు పదహారు స్ధానాల అవసరాన్ని వివరిస్తూ ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించిన సీఎం కేసీఆర్ నిర్మల్ సభలో చెలరేగిపోయారు. 2014 ఎన్నికల సమయంలో ఒక్కొక్కరి అకౌంట్‌లో 15 లక్షలు వేస్తానన్న మోడీ 15 రూపాయలు అయినా వేశారా ? అంటూ ప్రశ్నించారు. ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ఏముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారంటూ సూటిగా ప్రశ్నించారు . 10 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని కోటి మందికైనా ఇచ్చారా అంటూ బీజేపీని ప్రశ్నించారు.

ఐదు సంవత్సరాల నుంచి తాము పసుపు బోర్డ్ ఏర్పాటు చేయాలని అడుగుతుంటే పట్టించుకోని కేంద్రం తాము గెలిస్తే మూడు రోజుల్లో పసుపు బోర్డ్ పెడతామని రాజకీయ దిగజారుడు కాదా ? అంటూ కేసీఆర్ ప్రశ్నించారు. కేంద్రం చేతిలో మద్దతు ధరలు పెట్టుకుని ఆటలాడుతుదంటూ ఆరోపించారు. ఎన్నికల వస్తే రామజన్మభూమి, హిందువులు అని చెప్పడమే మోడీ రాజకీయాలా అంటూ విమర్శలు గుప్పించారు.

ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి విధానాలపై మాట్లాడకుండా వ్యక్తులపై విమర్శలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. దేశంలోని వనరుల లభ్యతను తెలియజేస్తూ వినియోగం తీరును తెలియజేస్తూ కాంగ్రెస్‌, బీజేపీలపై విమర్శల వర్షం కురిపించారు.

తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి దేశానికి ఆదర్శంగా ఉంటూ వస్తున్నామని పోడు భూముల క్రమబద్దీకరణతో పాటు శాశ్వత భూ యాజమాన్య దృవీకరణ పత్రాలు అందజేసేందుకు త్వరలోనే సరికొత్త రెవిన్యూ చట్టం తేనున్నట్టు ప్రకటించారు. దేశమే ఆశ్చర్యపడేలా కొత్త రెవిన్యూ చట్టం తెస్తామన్నారు .

ప్రధాని మోడీ టార్గెట్‌గా కేసీఆర్‌‌ విమర్శలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపాయి. పోలింగ్‌కు రెండు రోజుల గడువు ముందు బీజేపీపై విమర్శలు చేయడం రాజకీయ వ్యూహంలో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ అగ్రనేతలు కేసీఆర్ టార్గెట్‌గా చేస్తున్న విమర్శలకు ప్రతి విమర్శలతో రివర్స్ అటాక్ మొదలు పెట్టనట్టు భావిస్తున్నారు .

Next Story