logo

నిరుద్యోగ భృతి అమలుకు కసరత్తు...ఏ వయసు వరకు ఇవ్వాలి? అర్హతలేంటి?

తెలంగాణలో నిరుద్యోగ భృతి అమలుకు కసరత్తు మొదలైంది. ఎన్నికల మేనిఫెస్టో హామీలపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ నిరుద్యోగ భృతి విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు.

kcrkcr

తెలంగాణలో నిరుద్యోగ భృతి అమలుకు కసరత్తు మొదలైంది. ఎన్నికల మేనిఫెస్టో హామీలపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ నిరుద్యోగ భృతి విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా రాష్ట్రాల్లో అమలవుతోన్న తీరుపై అధ్యయనం చేస్తోన్న అధికారులు త్వరలోనే సీఎంకు సమగ్ర నివేదిక ఇవ్వనున్నారు.

నిరుద్యోగ భృతి అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ముఖ్యమైన హామీలపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ము‌ఖ్యంగా నిరుద్యోగ భృతి అమలు దృష్టిపెట్టారు. నిరుద్యోగులకు నెలకు 3వేల 16 రూపాయల భృతి ఇస్తామని ఎన్నికల్లో ప్రకటించిన కేసీఆర్‌ అధికారులను నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో కసరత్తు మొదలుపెట్టిన సీఎంవో అధికారులు నిరుద్యోగుల గుర్తింపు ఎలా చేపట్టాలి?, ఏ వయసు వరకు ఇవ్వాలి? అర్హతలపై అధ్యయనం చేస్తున్నారు.

నిరుద్యోగ భృతి అమలు చేస్తోన్న రాష్ట్రాల నుంచి సమాచారం సేకరించిన అధికారులు ఆయా ప్రభుత్వాలు ఈ పథకాన్ని ఎలా అమలు చేస్తున్నాయో పరిశీలిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, హర్యానా, ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ భృతి అమలవుతుండగా, 35ఏళ్లలోపు వారిని అర్హులుగా నిర్ణయించాయి. అలాగే కేరళలో టెన్త్‌ ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో ఇంటర్‌‌ ఏపీలో డిగ్రీ ఇతర అర్హతల ఆధారంగా నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. ఇలా ఆయా రాష్ట్రాల్లో అమలవుతోన్న విధానాన్ని అధ్యయనం చేశాక విధివిధానాలు ఖరారు చేయనున్నారు.

లైవ్ టీవి

Share it
Top