తెలంగాణలో మరో ఓట్ల పండగ.. కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్

తెలంగాణలో మరో ఓట్ల పండగ.. కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్
x
Highlights

నూతన పురపాలక చట్టం రూపకల్పనపై సీఎం కేసీఆర్ సమీక్ష చేపట్టారు. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. అవినీతి నిర్మూలన, మంచి...

నూతన పురపాలక చట్టం రూపకల్పనపై సీఎం కేసీఆర్ సమీక్ష చేపట్టారు. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. అవినీతి నిర్మూలన, మంచి సేవలందించడమే కొత్త చట్టం లక్ష్యంగా సీఎం పేర్కొన్నారు. ఇప్పటికే తెలంగాణలో అసెంబ్లీ, పంచాయతీ, లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాయి. గురువారం పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే కాగా ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం కేసీఆర్ దృష్టిపెట్టారు. ఈ మేరకు ఉన్నతాధికారులతో సమావేశమపై మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణపై చర్చలు జరిపారు. త్వరలోనే పదవీకాలం ముగుస్తున్న జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యుల ఎన్నికల నిర్వహణకు కేసీఆర్ అంగీకారం తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా తెలంగాణలో పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు ముగిసిన తరువాత మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో ఈ నెల 22 నుంచి మే 14 వరకు జిల్లా, మండల పరిషత్ ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదించింది. ఐతే ఫలితాలను మాత్రం లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాతే ప్రకటిస్తారు. ఇది ఇలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 62.69 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories