హెల్త్ స్టేటస్ ఆఫ్ తెలంగాణే లక్ష్యం

హెల్త్ స్టేటస్ ఆఫ్ తెలంగాణే లక్ష్యంగా ప్రజలందరికీ అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కంటి వెలుగు శిబిరాల మాదిరిగానే చెవి, ముక్కు, గొంతు, దంత పరీక్షలు కూడా నిర్వహించి, ప్రతీ పౌరుడి హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని ఆదేశించారు. నీటి పారుదల రంగానికి ఇస్తోన్న ప్రాధాన్యతను కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
హెల్త్ స్టేటస్ ఆఫ్ తెలంగాణే లక్ష్యంగా ప్రజలందరికీ అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కంటి వెలుగు శిబిరాల మాదిరిగానే చెవి, ముక్కు, గొంతు, దంత పరీక్షలు కూడా నిర్వహించి, ప్రతీ పౌరుడి హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని ఆదేశించారు. నీటి పారుదల రంగానికి ఇస్తోన్న ప్రాధాన్యతను కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, వైద్య శిబిరాల నిర్వహణ, పంచాయతీ ఎన్నికలు, బడ్జెట్ రూపకల్పనపై ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన కేసీఆర్ ఈ దఫా విద్యా వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కంటి వెలుగు శిబిరాలు నిర్వహించిన విధంగానే చెవి, ముక్కు, గొంతు, దంత పరీక్షలు కూడా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలందరికీ అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, ప్రతీ పౌరుడి హెల్త్ ప్రొఫైల్‌ను రూపొందించాలని దిశానిర్దేశం చేశారు.
2019-2020 బడ్జెట్ రూపకల్పనకు ఇప్పట్నుంచే కసరత్తు ప్రారంభించాలని అధికారులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా కేంద్రం ఈసారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో... రాష్ట్ర బడ్జెట్ పూర్తిస్థాయిలో ఉండాలా? మధ్యంతర బడ్జెట్ పెట్టుకోవాలా? అనే విషయాలపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయాలన్నారు. ఫించనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఇక త్వరలో జరగనున్న పంచాయతీరాజ్ ఎన్నికలకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తోందని కేసీఆర్ స్పష్టంచేశారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ, డిండి, శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకం లాంటి ఎత్తిపోతల పథకాలన్నీ ఈ దఫాలోనే పూర్తి చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ప్రస్తుతం ఏ ప్రాజెక్టు పని ఎంతవరకు వచ్చింది? ఇంకా ఎంత డబ్బు కావాలి? ఎక్కడైనా లోపాలున్నాయా? తదితర అంశాలపై నివేదిక తయారు చేయాలని దిశానిర్దేశం చేశారు. వచ్చే బడ్జెట్లో నీటిపారుదలకు సముచితరీతిలో నిధులు కేటాయిస్తూనే, నిధుల సమీకరణ కూడా జరుపుతామని తెలిపారు.
జనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్‌లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMTనల్గొండ జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర
10 Aug 2022 1:12 AM GMTSinkhole: భారీగా పెరుగుతున్న వింత గొయ్యి లోతు..
9 Aug 2022 3:00 PM GMT
కామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTఇవాళ తెలంగాణ మంత్రివర్గం సమావేశం
11 Aug 2022 2:16 AM GMTఇవాళ గాంధీభవన్‌లో రేవంత్ అధ్యక్షతన కీలక సమావేశం
11 Aug 2022 1:46 AM GMTకేసీఆర్ జిల్లాల పర్యటనకు రంగం సిద్ధం
11 Aug 2022 1:06 AM GMTనుపుర్ శర్మకు సుప్రీం కోర్టులో ఊరట
10 Aug 2022 4:00 PM GMT