స్టాలిన్‌తో ముగిసిన కేసీఆర్‌ భేటీ...ఇరువురి మధ్య కీలక చర్చ...

స్టాలిన్‌తో ముగిసిన కేసీఆర్‌ భేటీ...ఇరువురి మధ్య కీలక చర్చ...
x
Highlights

డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీ ముగిసింది. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు విషయంలో ఇద్దరు నేతల మధ్య కీలక చర్చ జరిగినట్టు తెలుస్తోంది....

డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీ ముగిసింది. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు విషయంలో ఇద్దరు నేతల మధ్య కీలక చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి కేసీఆర్‌‌తో పాటు ఎంపీలు వినోద్‌, సంతోష్‌ హాజరయ్యారు. చెన్నై వెళ్లిన కేసీఆర్‌కు స్టాలిన్‌ శాలువా కప్పి సత్కరించారు.

వారం వ్యవధిలో సీఎం కేసీఆర్ తమిళనాడుకు వెళ్లడం ఇది రెండోసారి. కాంగ్రెస్, బీజేపీయేతర పక్షాలను ఏకం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేసిన కేసీఆర్ ఇటీవల కేరళ, తమిళనాడులో పర్యటించారు. గత సోమవారం దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు బయలుదేరేముందే స్టాలిన్ ను కలవాలని అనుకున్నారు. దీంతో వెంటనే స్పందించిన స్టాలిన్ 13న చెన్నైకి రావాలంటూ ఆహ్వానించారు. దీంతో కేసీఆర్ ఆదివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లి స్టాలిన్‌ను కలిశారు.

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు దగ్గరపడుతుండటంతో రాష్ట్రాల బాటపట్టిన కేసీఆర్ పార్టీల అధినేతలు, సీఎంలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటికే ఒక దఫా దాదాపు తనకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాలన్నీ తిరిగొచ్చిన కేసీఆర్ రెండోసారి మళ్లీ ఫెడరల్ ప్రయత్నాలు ప్రారంభించారు. ఇటీవలే కేరళ వెళ్లిన కేసీఆర్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో భేటీ అయ్యి కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ మెజార్టీ సీట్లు దక్కించుకుని గెలిచే అవకాశాల్లేవని ప్రాంతీయ పార్టీలే కీలకం కానున్నాయని నిశితంగా వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories