ఇంటర్ వివాదంపై స్పందించిన కేసీఆర్..వీలయినంత త్వరగా

ఇంటర్ వివాదంపై స్పందించిన కేసీఆర్..వీలయినంత త్వరగా
x
Highlights

ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు ఉచిత వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌ నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వీలయినంత త్వరగా...

ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు ఉచిత వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌ నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వీలయినంత త్వరగా అడ్వాన్సుడ్ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల వెల్లడి అనంతరం తలెత్తిన పరిణామాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఫెయిల్ బాధతో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవద్దని కేసీఆర్‌ విజ్నప్తి చేశారు.ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల వెల్లడి అనంతరం తలెత్తిన పరిణామాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి జి.జగదీష్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్థన్ రెడ్డి, బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ కార్యదర్శి డాక్టర్ ఎ.అశోక్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ ఈ సమీక్షలో పాల్గొన్నారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఇంటర్ లో ఫెయిలైన మూడులక్షలపైగా విద్యార్థులకు ఉచిత వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశించారు. పాసయిన విద్యార్థులు రీవెరిఫికేషన్ కోరుకుంటే గతంలో అనుసరించిన పద్ధతి ప్రకారమే ఫీజు తీసుకోవాలని, రీకౌంటింగ్ ప్రక్రియను వీలయినంత త్వరగా ముగించాలని కోరారు. నీట్, జేఈఈ లాంటి దేశ వ్యాప్త ప్రవేశ పరీక్షలకు విద్యార్థులు హాజరు కావాల్సి ఉన్నందున వీలయింత త్వరగా అడ్వాన్సుడ్ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించి, ఫలితాలు వెల్లడించాలి అని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్, అడ్వాన్సుడు సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ ప్రక్రియనంతా పర్యవేక్షించే బాధ్యతను విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్థన్ రెడ్డికి ముఖ్యమంత్రి అప్పగించారు. భవిష్యత్తులో పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇంటర్ ఫెయిల్ బాధతో కొందరువిద్యార్థులు ఆత్మహత్యకు చేసుకోవడంపై సీఎం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్ ఫెయిల్ అయినంతమాత్రన జీవితం ఆగిపోదని, ఎన్నో అవకాశాలు ఉంటాయని చెప్పారు. విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవద్దని కేసీఆర్‌ విజ్నప్తి చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories