అప్పులన్నీ అభివృద్ధి పనులకే ఖర్చు చేస్తున్నాం : కేసీఆర్

అప్పులన్నీ అభివృద్ధి పనులకే ఖర్చు చేస్తున్నాం : కేసీఆర్
x
Highlights

మూడు రోజులు, నాలుగు బిల్లులు డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికతో తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ముగిశాయి. మొత్తం 10 గంటలకు పైగా సమావేశాలు జరిగినా చివరిరోజు మాత్రం...

మూడు రోజులు, నాలుగు బిల్లులు డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికతో తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ముగిశాయి. మొత్తం 10 గంటలకు పైగా సమావేశాలు జరిగినా చివరిరోజు మాత్రం ద్రవ్యవినిమయ బిల్లుపై వాడీ వేడీ చర్చ జరిగింది. అప్పులన్నీ అభివృద్ధి కోసమే ఖర్చు చేస్తున్నామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు మూడు రోజుల పాటు జరిగాయి. ఈ సమావేశంలోనే ఓట్ ఆన్ అకౌంట్‌ బడ్జెట్‌ను సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టారు. మొత్తం 10 గంటలా 4 నిముషాల పాటు చర్చ జరగ్గా 29 మంది సభ్యులు మాట్లాడారు.

ఈ సమావేశాల్లోనే ద్రవ్యవినిమయ బిల్లుతో పాటు పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, అటవీ సంరక్షణ చట్ట సవరణ బిల్లు, జీఎస్టీ సవరణ బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. ఇటు చివరిరోజు సమావేశాల్లో రాష్ట్రం తీసుకొస్తున్న అప్పులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమాధానమిచ్చారు. ఎఫ్‌ఆర్బీఎంకు లోబడే తాము అప్పులు చేస్తున్నామని వాటిని ప్రాజెక్టులను నిర్మించేందుకు, అభివృద్ధి కార్యక్రమాలకే వినియోగిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇటు శాసనమండలి కూడా నిరవధిక వాయిదా పడింది. మంత్రి ఈటల రాజేందర్‌ మండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌పై చర్చ జరిపిన సభ్యులు ఆమోదం తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories