Top
logo

ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబుపై సీఎం కేసీఆర్‌ ఫైర్‌

ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబుపై సీఎం కేసీఆర్‌ ఫైర్‌
X
Highlights

కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చెప్పినవన్నీ గాలిమాటలని...

కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చెప్పినవన్నీ గాలిమాటలని కొట్టిపారేశారు. శ్రీధర్‌బాబు సభను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బడ్జెట్‌లో గ్రామపంచాయతీలకు 40 వేల కోట్లు కేటాయించామని తెలిపారు. పంచాయతీరాజ్‌ యాక్ట్‌ చదివితే బాగుంటుందని శ్రీధర్‌బాబుకు సీఎం సూచించారు. కాంగ్రెస్‌ హయాంలో సోలార్‌ విద్యుత్‌ అనేదే లేదని కేసీఆర్‌ తేల్చిచెప్పారు.

అంతకు ముందు నిన్న సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పంచాయతీలకు నిధుల ప్రస్తావన లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆరోపించారు. ఓట్ ఆన్ అకౌంట్‌ బడ్జెట్‌ సందర్భంగా చర్చను ప్రారంభించిన శ్రీధర్‌బాబు గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వల్లే ఇవాళ 24 గంటల విద్యుత్‌ సాధ్యమైందన్నారు. వడ్డీ మాఫీ విషయంలోనూ రైతులు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారన‍్నారు. రైతుబంధు పధకంతో పాటు రైతులను ఆదుకోవాలని, అలాగే ఐఆర్‌ కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారని శ్రీధర్‌ బాబు సభలో ప్రస్తావించారు.

Next Story