Top
logo

చేవెళ్ల ఎంపీ సీటుపై కేసీఆర్‌ నుంచి హామీ..!

చేవెళ్ల ఎంపీ సీటుపై కేసీఆర్‌ నుంచి హామీ..!
Highlights

మహేశ్వరం కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కారెక్కడానికి ముహూర్తం ఖరారైంది. టీఆర్‌ఎస్‌లో చేరాలని...

మహేశ్వరం కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కారెక్కడానికి ముహూర్తం ఖరారైంది. టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్న సబిత తన కుమారులతో కలిసి నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. ముఖ్యంగా తన కుమారుడు కార్తీక్‌‌రెడ్డికి చేవెళ్ల ఎంపీ సీటు ఇవ్వాలని సబితా ఇంద్రారెడ్డి కోరగా, సీఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

మహేశ్వరం కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కారెక్కే ముహూర్తం ఖరారైంది. ప్రగతిభవన్‌లో నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమైన సబిత టీఆర్‌ఎస్‌లో చేరడంపై చర్చించారు. ముఖ్యంగా తన కుమారుడు కార్తీక్‌‌రెడ్డికి చేవెళ్ల ఎంపీ సీటు ఇవ్వాలని సబితా ఇంద్రారెడ్డి కోరగా, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

కేసీఆర్‌తో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి మర్యాదపూర్వకంగానే ముఖ‌్యమంత్రిని కలిసినట్లు చెప్పారు. తాము అడగాల్సినవి అడిగామ్ సీఎం చెప్పాల్సినవి చెప్పారన్నారు. అతిత్వరలోనే చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహించి టీఆర్‌ఎస్‌లో చేరతామని కార్తీక్‌రెడ్డి తెలిపారు.

Next Story


లైవ్ టీవి