Top
logo

ప్రచారం ఫేజ్‌-2

ప్రచారం ఫేజ్‌-2
X
Highlights

టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార శంఖరావాన్ని పూరించనున్నారు. నేటి నుంచి ఆయన ప్రచారం...

టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార శంఖరావాన్ని పూరించనున్నారు. నేటి నుంచి ఆయన ప్రచారం ప్రారంభించనున్నారు. తొలి సభ మిర్యాలగూడలో మొదలుపెట్టి, చివరి సభను ఏప్రిల్ నాలుగున ఖమ్మంలో ముగించనున్నారు.

లోక్ సభ ఎన్నికల ప్రచార బరిలోకి తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ దిగనున్నారు. నేడు మిర్యాలగూడలో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం సభతో కేసీఆర్ ప్రచారానికి శ్రీకారం చుట్టునున్నారు. అలాగే హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల సభలో పాల్గొంటారు. ఈ నెల 31న వనపర్తిలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం సభలో కేసీఆర్ పాల్గొంటారు. అదే రోజు మహబూబ్ నగర్ లో జరిగే సభకు హాజరవుతారు.

ఏప్రిల్ ఒకటిన రామగుండంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సభలో కేసీఆర్ ప్రసంగిస్తారు. ఏప్రిల్ రెండున వరంగల్, భువనగిరి సభల్లో పాల్గొంటారు. ఏప్రిల్ మూడున అందోల్ లో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సభకు హాజరవుతారు. అదే రోజు నర్సాపూర్ లో మెదక్ పార్లమెంట్ నియెజకవర్గ సభలో ప్రసంగిస్తారు. ఏప్రిల్ నలుగున మహబూబాబాద్, ఖమ్మంల్లో కేసీఆర్ పాల్గొని ప్రచారం ముగిస్తారు. కేసీఆర్ ఎన్నికల సభలతో తెలంగాణలో ప్రచారం మరింత వేడెక్కనుంది.

Next Story