Top
logo

ప్రతి అమర జవాను కుటుంబానికి 25 లక్షలు: సీఎం కేసీఆర్

ప్రతి అమర జవాను కుటుంబానికి 25 లక్షలు: సీఎం కేసీఆర్
X
Highlights

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సభ ప్రారంభమైన వెంటనే ఇటీవల జమ్ముకశ్మీర్ లోని...

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సభ ప్రారంభమైన వెంటనే ఇటీవల జమ్ముకశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఉగ్రదాడిలో అసువులు బాసిన అమర జవాన్ల కుటుంబాలను ఆదుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అంతే కాకుండా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన 40మంది జవాన్ల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం ఇవ్వనున్నట్లు కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటన చేశారు.

Next Story