ఏపీలో మంత్రివర్గ కూర్పుపై ఉత్కంఠ..ఆశల పల్లకిలో ఎమ్మెల్యేలు

ఏపీలో మంత్రివర్గ కూర్పుపై ఉత్కంఠ..ఆశల పల్లకిలో ఎమ్మెల్యేలు
x
Highlights

ఏపీలో వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు తీవ్రమైన ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో బెర్త్ దక్కుతుందని ఆశలు పెట్టుకున్న...

ఏపీలో వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు తీవ్రమైన ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో బెర్త్ దక్కుతుందని ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యేల కల నేడు తీరనుంది. ఇప్పటికే వైసీపీలో పదవులపై ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఈనెల 7వ తేదీన జగన్ వైసిపి ఎల్ పి సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ సమావేశం మరుసటి రోజే కేబినెట్ ప్రకటన ఉండనుంది. ప్రతి జిల్లా నుండి ఇద్దరికి మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నారని సమాచారం. అదే విధంగా మొదటి నుండి పార్టీలో ఉన్నవారికి గత ఐదు సంవత్సరాల్లో ప్రజా సమస్యలపై నిర్విరామంగా పోరాటాలు చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రాతిపదిగా ఇప్పటికే కొందరికి మంత్రి పదవులు ఖాయమన్న ప్రచారం జరుగుతోంది.

వైసీపీ ఎల్ పీ సమావేశంలోనే క్యాబినెట్ లో ఎవరెవరికి చోటు దొరుకుతుంది ? ఎవరెవరికి ఏయే శాఖలు లభిస్తున్నాయి ? అన్న ది దాదాపు ఓ క్లారిటీ రానుంది. ఇక మంత్రి పదవులపై ఇప్పటికే జాబితాను సిద్ధం చేసుకున్న జగన్ ఆ రోజు సమావేశంలో చదివి వినిపించ బోతున్నారు. ఎవరెవరిని మంత్రివర్గంలోకి ఎందుకు తీసుకున్నారో స్పష్టంగా చెప్పడంతో పాటు మంత్రి పదవులు రాని వారిని ఆ రోజు బుజ్జ గించే ప్ర క్రియ కూడా ఉంటుందని తెలుస్తోంది. జగన్ కేబినెట్ లో ముఖ్యమంత్రి కాకుండా మరో 25 మందికి మాత్రమే చోటు ఉంటుంది. కానీ లిస్టులో 50 మందికి పైగా ఎమ్మెల్యేలు మంత్రి పదవులు ఆశిస్తున్నారు.

శ్రీకాకుళం నుండి విశ్వసరాయి కళావతి, విజయనగరం నుండి బొత్స సత్యనారాయణ పేర్లు దాదాపు ఖరారయ్యాయి. అలాగే కురుపాం నుండి గెలిచిన పాముల పుష్పశ్రీవాణి పేరుతో కూడా వినిపిస్తోంది. విశాఖ నుండి అవంతి శ్రీనివాసరావు, పశ్చిమ గోదావరి నుండి గ్రంథి శ్రీనివాస్ , కృష్ణాజిల్లా నుండి కొడాలి నాని, గుంటూరు జిల్లా నుండి ఆళ్ల రామకృష్ణారెడ్డి, మర్రి రాజశేఖర్ పేర్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. వీరితోపాటు ప్రకాశం జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి, చిత్తూరు నుండి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, భూమన కరుణాకరెడ్డికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది.

అనంతపురం నుండి అనంత వెంకట్రామిరెడ్డికి అవకాశం దక్కనుంది. కర్నూలు నుండి శ్రీకాంత్ రెడ్డికి ఖాయమైనట్లు తెలిసింది. కడప నుండి అంజద్ బాషాకు దక్కే అవకాశం ఉంది. వీటిల్లో ఒకటీ అరా మార్పులు జరిగే సూచనలూ కనిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లా నుండి ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి గౌతం రెడ్డి,కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,కాకాని గోవర్ధన్ రెడ్డి, వరప్రసాద్ ల పేర్లు వినిపిస్తున్నాయి. ఎక్కువ సంఖ్యలో రేసులో ఈ జిల్లా నుండే కనిపిస్తోంది. కృష్ణాజిల్లా నుండి రక్షణనిధి, గుంటూరు నుండి మేరుగ నాగార్జున పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మైనార్టీ కోటాలో గుంటూరు నుండి గెలిచి టీడీపీ నుండి తీవ్ర ఒత్తిడులు ఎదుర్కొన్న ముస్తఫా పేరూ పరిశీలనలో ఉంది.

సామాజికవర్గాలు, ప్రాంతాలు. ఏరియాల వారిగా సీనియార్టీ, త్యాగాలను బేరీజు వేసుకుని జగన్ కేబినెట్ కూర్పు చేశారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఒక్కోసారి సీనియర్లకు కూడా అవకాశం దక్కే పరిస్థితి ఉంటుంది. అదే పరిస్థితి ఇప్పుడు జగన్ కేబినెట్ లో చాలామందికి ఎదురుకానుంది. అయితే వీరందరిని జగన్ ఎలాంటి అసంతృప్తి జ్వాలలు ఎగసిపడ కుండా బుజ్జగించుకోవాల్సి ఉంటుంది. రాజకీయంగా కనీసం మంత్రి పదవి కూడా చేపట్టకుండా నేరుగా ముఖ్యమంత్రి అయిన జగన్ తన కన్నా సీనియర్లను సమన్వయం చేసుకోవడంలోనూ, పదవులు రాని వారిని బుజ్జగించడంలో ఎలాంటి నేర్పు చూపిస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories