కేసీఆర్‌కు చంద్రబాబు వార్నింగ్

కేసీఆర్‌కు చంద్రబాబు వార్నింగ్
x
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఏపీ సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్‌ దాదాగిరి చేయాలనుకుంటే ఖబడ్దార్‌ అంటూ ఆయన హెచ్చరించారు. చంద్రబాబు మూడు నెలల్లో...

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఏపీ సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్‌ దాదాగిరి చేయాలనుకుంటే ఖబడ్దార్‌ అంటూ ఆయన హెచ్చరించారు. చంద్రబాబు మూడు నెలల్లో తనను మూడు వేల తిట్లు తిట్టాడన్న కేసీఆర్ విమర్శలకు ఏపీ సీఎం కౌంటర్ ఇచ్చారు. ఆంధ్రులను నీచాతి నీచంగా తిట్టిన వ్యక్తి కేసీఆరేనని గుర్తు చేశారు. తనకు తిట్లే రావన్న చంద్రబాబు పౌరుషంగా మాట్లాడం మాత్రమే తనకు వచ్చన్నారు. ఢిల్లీలో చక్రం తిప్పుతానటున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అసలు ఢిల్లీలో చక్రం ఉంటేగా కేసీఆర్‌ తిప్పడానికి అని ఎద్దేవా చేశారు. ఆంధ్రుల వ్యతిరేక పార్టీ అయిన టీఆర్‌ఎస్‌తో కుమ్మక్కై వైసీపీ టీడీపీని ఓడించాలని చూస్తోందని నెల్లూరులో జరిగిన ఎన్నికల సన్నాహక సభలో చంద్రబాబు విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories