Top
logo

రేపు సాయంత్రం కోల్‌కతాకు చంద్రబాబు పయనం

రేపు సాయంత్రం కోల్‌కతాకు చంద్రబాబు పయనం
X
Highlights

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు సాయంత్రం కోల్‌కతా వెళ్లనున్నారు. పశ్చిమ బెంగాల్‌ సీఎం, కాంగ్రెస్ తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో అక్కడ జరిగే ర్యాలీలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు సాయంత్రం కోల్‌కతా వెళ్లనున్నారు. పశ్చిమ బెంగాల్‌ సీఎం, కాంగ్రెస్ తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో అక్కడ జరిగే ర్యాలీలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఈ నేపధ్యంలో అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం సమావేశం నిర్వహించారు. తన కోల్‌కతా ప్రయాణం, గురువారం జగన్‌తో కేటీఆర్‌ భేటీ అంశాలను వారితో చర్చించారు. మంత్రుల సూచనలు, సలహాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశానికి మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణ, కాల్వ శ్రీనివాసులు, సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.

Next Story