Top
logo

కేసీఆర్ కోరిక అదే: చంద్రబాబు

కేసీఆర్ కోరిక అదే: చంద్రబాబు
X
Highlights

ఎలక్షన్‌ మిషన్‌ 2019 పై ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా...

ఎలక్షన్‌ మిషన్‌ 2019 పై ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర హితం కోరే వారంతా టీడీపీతోనే ఉంటారని ప్రజల కోసం పనిచేసేది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వమే అని అన్నారు. నేరాలు, ఘోరాలు చేయడమే బీజేపీ, వైసీపీలు పనిగా పెట్టుకున్నాయని అన్నారు. చేతకానివారు ఏపీలో అధికారంలో ఉండాలనేది కేసీఆర్‌ కోరుకుంటున్నారని చంద్రబాబు చెప్పారు. కేసుల మాఫీ కోసం మోడీతో డబ్బుల కోసం కేసీఆర్‌తో జగన్‌ రాజీ పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులున్నవారికే జగన్‌ టిక్కెట్లు ఇస్తున్నారని మోసాల్లో జగన్‌ ఘనుడని చంద్రబాబు మండిపడ్డారు.

Next Story