కాసేపట్లో టీడీపీ మేనిఫెస్టో విడుదల..అభివృద్ధితో పాటు సంక్షేమ రంగానికి పెద్దపీట

కాసేపట్లో టీడీపీ మేనిఫెస్టో విడుదల..అభివృద్ధితో పాటు సంక్షేమ రంగానికి పెద్దపీట
x
Highlights

మీ భవిష్యత్ నా బాధ్యత పేరుతో రూపొందించి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కాసేపట్లో విడుదల కానుంది. ఉగాది పర్వదినం రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు...

మీ భవిష్యత్ నా బాధ్యత పేరుతో రూపొందించి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కాసేపట్లో విడుదల కానుంది. ఉగాది పర్వదినం రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లాంఛనంగా ఆవిష్కరించనున్నారు. సబ్బండ వర్గాలను ఆకట్టుకునే విధంగా టీడీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లు తెలుస్తోంది.

పుట్టుక నుంచి మరణం వరకు ప్రతి కుటుంబానికి లబ్దిచేకూరేలా దాదాపు వందకుపైగా పథకాలను ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. వీటిని మరింత మెరుగ్గా తీర్చి మేనిఫెస్టో ప్రజల ముందుకు తీసుకువస్తున్నారు. రైతు, మహిళ, యువత, విద్యార్థి ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునే మేనిఫెస్టో ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ ఇప్పటికే ఐదు కీలక సంక్షేమ పథకాలను ప్రకటించి నిధులను లబ్ధిదారుల ఖాతాలకు మూడు దశల్లో వేస్తోంది. పాత వాటిని కొనసాగిస్తూనే కొత్త వాటికి టీడీపీ మేనిఫెస్టో కమిటీ సభ్యులు రూపకల్పన చేశారు.

అభివృద్ధితో పాటు సంక్షేమ రంగానికి పెద్దపీట వేయనున్నారు చంద్రబాబు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన పార్టీ మేనిఫెస్టో కమిటీ అనేక ప్రతిపాదనలతో రూపొందించింది. చంద్రన్నపెళ్లి కానుక పథకం లబ్ధిదారులకు చెక్‌తో పాటు ఇంటి స్థలం లేదా ఇల్లు మంజూరు పత్రాలు, గ్యాస్ కనెక్షన్ వంటివి పెళ్లి పీటల మీదే అందజేసే లాంటి పథకాలను ప్రకటించనున్నారు.

రైతులకు అందించే 9గంటల ఉచిత విద్యుత్‌ను 12గంటలకు పెంచే యోచనలో టీడీపీ ఉంది. 2023తో ముగియనున్న ఎస్సీ ఉప ప్రణాళిక కాలపరిమితిని మరో 10ఏళ్లు పొడిగించే అంశాన్ని మేనిఫెస్టో లో చేర్చనున్నట్లు తెలుస్తోంది. కుటుంబ వికాసం కోసం మేనిఫెస్టోలో 15అంశాలు, సమాజ వికాసం కోసం 10అంశాలు చేర్చినట్లు తెలుస్తోంది. 60ఏళ్లకే వృద్ధాప్య పెన్షన్, మహిళలకు 55 సంవత్సరాలకే పెన్షన్ వంటి జనాకర్షక పథకాలు తీసుకొస్తుంది.

నూతన యువజన విధానాన్ని కూడా తీసుకురానున్నారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని మరింత సమర్థవంతంగా పని చేసేలా విధివిధానాలు మేనిఫెస్టోలో చేర్చారని తెలిసింది. వ్యవసాయ పంటలను ప్రోత్సహించడం కోసం చేపట్టే విధానాలు ప్రకటిస్తారు. పసుపు కుంకుమ భవిష్యత్‌లోను కొనసాగింపు, చెరువుల అనుసంధానం, ఐదు నదుల అనుసంధానం అంశాలు మేనిఫెస్టోలో ఉండనున్నాయి. మొత్తానికి అన్ని వర్గాలను సంతృప్తి పరిచేవిధంగా ప్రజాకర్షక మేనిఫెస్టోను చంద్రబాబు ఆవిష్కరించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories