Top
logo

తెలంగాణలో సిమెంట్‌ రోడ్లు కూడా లేవు..తెలంగాణకు మనకి పోలిక: చంద్రబాబు

తెలంగాణలో సిమెంట్‌ రోడ్లు కూడా లేవు..తెలంగాణకు మనకి పోలిక: చంద్రబాబు
X
Highlights

ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే మరణశాసనం రాసుకున్నట్టేనని సీఎం చంద్రబాబు విమర్శించారు. జగన్‌కు వేస్తే ఓటు...

ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే మరణశాసనం రాసుకున్నట్టేనని సీఎం చంద్రబాబు విమర్శించారు. జగన్‌కు వేస్తే ఓటు మోడీకి వేసినట్టేనని, జగన్ కు ఓటేస్తే ఏపీ ప్రజలకు భద్రత ఉండదని అన్నారు. జగన్, కేసీఆర్, మోడీలు నాటకాలాడుతున్నారని వీరంతా ఏపీకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తుల కారణంగా రేపు ఏపీకి ప్రాజెక్టుల నుంచి నీళ్లు కూడా రావని, రాష్ట్ర అభివృద్ధి ఆగిపోతుందని చంద్రబాబు అన్నారు. డ్రైవింగ్‌ రానివారికి స్టీరింగ్‌ ఇస్తే ప్రాణాలు పోతాయని చెప్పారు. తెలంగాణలో సిమెంట్‌ రోడ్లు కూడా లేవని, అసలు తెలంగాణకు మనకి పోలిక ఉందా అని చంద్రబాబు ప్రశ్నించారు. బీజేపీ నమ్మకద్రోహం చేసింది. కేంద్రం, తెలంగాణ సర్కార్ మానవత్వం లేకుండా ప్రవర్తించాయి. మన రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలు నా మానసపుత్రిక. తెలంగాణలో కూడా ఇన్ని పథకాలు పెట్టలేదు.

Next Story