Top
logo

జోరు పెంచిన చంద్రబాబు.. ముగ్గురు అభ్యర్థుల ఖరారు

జోరు పెంచిన చంద్రబాబు.. ముగ్గురు అభ్యర్థుల ఖరారు
X
Highlights

ఏపీ సీఎం చంద్రబాబు రాజమండ్రి పార్లమెంట్‌ పరిధిలోని నాయకులతో చంద్రబాబు భేటీ అయ్యారు. 3 అసెంబ్లీ స్థానాల్లో...

ఏపీ సీఎం చంద్రబాబు రాజమండ్రి పార్లమెంట్‌ పరిధిలోని నాయకులతో చంద్రబాబు భేటీ అయ్యారు. 3 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. రాజానగరం టికెట్‌ను పెందుర్తి వెంకటేశ్‌, రాజమండ్రి రూరల్‌ టిక్కెట్‌ను గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గోపాలపురం టిక్కెట్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్లను చంద్రబాబు ఖరారు చేశారు. అయితే సమయం లేకపోవడంతో రాజమండ్రి సిటీ, కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గ నేతలతో చంద్రబాబు భేటీ కాలేదు. కర్నూలు టూర్‌ ముగిశాకే మిగతా స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తారు.

రాజమండ్రి సిటీ టిక్కెట్‌ కోసం ఆదిరెడ్డి అప్పారావు, చల్లా శంకర్రావ్‌ పోటీ పడుతున్నారు. కొవ్వూరు సీటు కోసం వేమగిరి వెంకట్రావ్‌, టీవీ రామారావు మధ్యే పోటీ నెలకొంది. అలాగే నిడదవోలు టిక్కెట్‌ రేసులో సిట్టింగ్‌ ఎమ్మెల్యే శేషారావు తో పాటు సత్యనారాయణ కూడా ఉన్నారు. ఇటు రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయబోనని మురళీమోహన్‌ స్పష్టం చేయడంతో టిక్కెట్‌ రేసులో బొడ్డు భాస్కరరావుతో పాటు పారిశ్రామకి వేత్త బీఎస్‌ఆర్‌, గన్నీ కృష్ణా, కేప్టెన్‌ మూర్తీ పోటీ పడుతున్నారు.

Next Story