Top
logo

కేంద్రంపై సీఎం చంద్రబాబు దీక్షాస్త్రం

కేంద్రంపై సీఎం చంద్రబాబు దీక్షాస్త్రం
X
Highlights

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నవేళ సీఎం చంద్రబాబు మోడీ సర్కారుపై దీక్షాస్త్రం సంధించబోతున్నారు. ఏపీ సమస్యలపై...

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నవేళ సీఎం చంద్రబాబు మోడీ సర్కారుపై దీక్షాస్త్రం సంధించబోతున్నారు. ఏపీ సమస్యలపై మరోసారి ఢిల్లీ వేదికగా గళమెత్తాలని టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ణయించారు. కొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే పార్లమెంటు ఓటాన్ ఎకౌంట్ సమావేశాల సమయంలోనే చంద్రబాబు దీక్ష చేయబోతున్నారు. విభజన హామీల అమలులో ఏపీకి జరుగుతున్న అన్యాయంతో పాటు మోడీ ప్రభుత్వ తీరును నిరశిస్తూ చంద్రబాబు ఒక రోజు దీక్ష చేస్తారు.

ఏపీకి ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అన్యాయానికి నిరసనగా చంద్రబాబు దీక్షకు కూర్చుంటే ఎలా ఉంటుందనే అంశంపై టీడీపీ భేటీలో చర్చించారు. ఏపీ సమస్యలను కేంద్ర బడ్జెట్‌లోగా పరిష్కరించపోతే దీక్షకు దిగాలనే యోచనలో ఉన్నారు. చంద్రబాబు దీక్షకు కూర్చుంటే జాతీయ నేతలంతా వచ్చి మద్దతు తెలుపుతారని నేతలు యోచిస్తున్నారు. చంద్రబాబు దీక్ష ద్వారా ఏపీకి ఎన్డీయే ప్రభుత్వం చేసిన అన్యాయం మరోసారి జాతీయ స్థాయిలో ప్రధాన అంశం అవుతుందని నేతలు భావిస్తున్నారు. పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపే చంద్రబాబు దీక్ష ఉంటుందని సమాచారం.

Next Story