logo

నిన్న మోడీ సభలో కనిపించిన వారంతా అద్దె జనమే

నిన్న మోడీ సభలో కనిపించిన వారంతా అద్దె జనమే

ఏపీ ప్రజలు పోరాడుతున్నది హక్కుల కోసమేనని సీఎం చంద్రబాబు అన్నారు. ఆంధ్రుల ముందు మోడీ ఆటలు సాగవని చంద్రబాబు ధర్మపోరాట దీక్షలో హెచ్చరించారు. గుంటూరులో నిన్న జరిగిన మోడీ సభకు అద్దె జనాల్ని తీసుకు వచ్చారన్న చంద్రబాబు అద్దె గొంతుకులతో ప్రజల ఆకాంక్షల్ని అణగదొక్కలేరని అన్నారు. ధర్మాన్ని మరచిన మోడీకి పాలించే అర్హత లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపు ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరి చేయాలని ధర్మ పోరాట దీక్షలో చంద్రబాబు డిమాండ్ చేశారు. పార్లమెంటు వేదికగా మోడీ ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. విభజన గాయాన్ని మోడీ పెద్దది చేస్తున్నారన్న చంద్రబాబు పుండుపై కారం చల్లేందుకే ప్రధాని గుంటూరు వచ్చారని విమర్శించారు. తెలుగు ప్రజల సత్తా ఏంటో తెలియని మోడీకి ఆ ప్రతాపం చూపుతామని హెచ్చరించారు.

లైవ్ టీవి

Share it
Top