అన్ని వర్గాలకు చేయూతనందిస్తున్న ఏపీ సర్కార్

అన్ని వర్గాలకు చేయూతనందిస్తున్న ఏపీ సర్కార్
x
Highlights

వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది ఏపీ సర్కార్. ఆర్థిక, అసమానతల నుంచి వారిని గట్టేక్కించేందుకు వేలాది కోట్ల రూపాయలు...

వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది ఏపీ సర్కార్. ఆర్థిక, అసమానతల నుంచి వారిని గట్టేక్కించేందుకు వేలాది కోట్ల రూపాయలు వెచ్చించింది. విద్యార్థులు, మహిళలు, గిరిజనులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు చేయూతనందిస్తోంది. బడుగు, బలహీన వర్గాల కోసం బడ్జెట్ వ్యయం 11,120 కోట్ల నుంచి 14,567 కోట్లకు పెంచింది ప్రభుత్వం.

సామాజిక సాధికారత, సంక్షేమంలో దేశానికే మార్గదర్శకంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. సామాజికంగా వివిధ వర్గాల మధ్య ఉన్న ఆర్థిక, సామాజిక అసమానతలను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లుగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. సామాజిక వివక్షకు గురవడమే కాకుండా భూమి, ఇతర వనరులు అందుబాటులో లేక షెడ్యూల్డ్ కులాల వారి నివాస ప్రాంతాలు సుదూరంగా విసిరేసినట్టు ఉండేవి. సంప్రదాయ నైపుణ్య వృత్తులకు ఆదరణ తగ్గి బలహీన వర్గాలు వారు సామాజిక, ఆర్థిక విద్యా పరమైన వెనుకబాటు వల్ల అనేక అసమానతలు ఎదుర్కొంటూ వచ్చారు.

ఆయా వర్గాల సంక్షేమానికి , సాధికారతకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. షెడ్యూల్డ్ కులాల వారి పిల్లల విద్య కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీని 1984లో ఏర్పాటుచేసిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశే. గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం 1986లో సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేసింది. 1998లో షెడ్యూలు కులాల కోసం ముందడుగు పథకాన్ని , బలహీన వర్గాల ప్రజలకు వృత్తిపరంగా పరికరాలు అందజేసేందుకు ఆదరణ పథకం ప్రారంభించింది.

భిన్న ప్రతిభావంతులకు 1999లో చేయూత పథకాన్ని అందించింది. మైనారిటీలకు రుణాలు అందించేందుకు రోష్ని పథకం ప్రవేశ పెట్టింది. అన్నింటికి మించి స్వయం సహాయక బృందాలను సంఘటిత శక్తిగా నిర్వహించడానికి 1998లో వెలుగు పథకం ద్వారా మహిళల సామాజిక ఆర్థిక సాధికారతలో దేశానికి దిక్సూచిగా మారింది ఏపీ.

పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్‌లకు 2014-2015 నుంచి 2018-2019 వరకు ఏటా 16 లక్షల మంది విద్యార్థులకు 12,833 కోట్లు విడుదల చేసింది. అలాగే పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, మైనారిటీ , దివ్యాంగులకు స్కాలర్ షిప్‌ పెంచారు. అంబేద్కర్ విదేశీ విద్య పథకం కింద ఎస్సీ, ఎస్టీ మైనారిటీ విద్యార్థులకు ఉన్నత విద్యను విదేశాల్లో అభ్యసించడానికి స్కాలర్ షిప్ గ్రాంట్‌ను 10 లక్షల నుంచి 15 లక్షలకు పెంచింది ప్రభుత్వం. 2013-14 నుంచి ఈ పథకం కింద 377కోట్లు ఖర్చు పెట్టగా 4,528మంది విద్యార్థులు లబ్ధి పొందారు.

ఆయా వర్గాల సంక్షేమం కోసం ఉప ప్రణాళిక పరిధిలో ఉన్న మూడు విభాగాలకు బడ్జెట్‌ను 2014-15లో 12,716 కోట్ల నుంచి 2018-2019లో 25,904 కోట్లకు పెంచింది. బడుగు, బలహీన వర్గాల కోసం చంద్రబాబు నాయుడు చేపట్టిన పథకాలు ఎంతో చేయూతనిస్తున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందడంతో ఆర్థికంగా, సామాజికంగా ఎంతో మెరుగుపడ్డామని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories