logo

ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు సవాల్!

ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు సవాల్!
Highlights

ప్రధాని నరేంద్రమోడీపై మరోసారి చంద్రబాబు సవాల్ విసిరారు. మంగళవారం అమరవతిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ

ప్రధాని నరేంద్రమోడీపై మరోసారి చంద్రబాబు సవాల్ విసిరారు. మంగళవారం అమరవతిలో మీడియా సమావేశం నిర్వహించారు. దేశానికి మోడీ ఏం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ఈ విషయంలో తనతో చర్చకు సిద్ధమా అని ఓపెన్‌ ఛాలెంజ్‌ విసిరారు. మోడీ ప్రధాని అయ్యాక దేశంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని.. ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని భ్రష్టుపట్టించేలా పాలన సాగుతుందని చంద్రబాబు మండిపడ్డారు. మోడీ తీసుకునే చర్యల వల్ల భారతదేశ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బలహీనుల్నీ అధికారంలోకి తెచ్చి ఏపీ రాష్ట్రభివృద్ధిని అడ్డుకోవాలన్నదే మోడీ ద్యేయమని అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక సుస్థిరత రాకుండా చేస్తున్నారని, తమ దృష్టి మర్చి, తమను రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారంటూ మోడీని దుయ్యబట్టారు. సుస్థిర ప్రభుత్వం రాకుండా, సామంత రాజులు రావాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.


లైవ్ టీవి


Share it
Top