అన్నదాత సుఖీభవ...కేంద్రం సాయంతో కలిపి మొత్తం రూ.15వేలు సాయం

అన్నదాత సుఖీభవ...కేంద్రం సాయంతో కలిపి మొత్తం రూ.15వేలు సాయం
x
Highlights

ముఖ్యమంత్రి చంద్రబాబు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరోసారి రైతులపై వరాల జల్లు కురిపించిన సీఎం ప్రతి రైతు కుటుంబానికి 9వేలు ఇవ్వనున్నట్లు...

ముఖ్యమంత్రి చంద్రబాబు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరోసారి రైతులపై వరాల జల్లు కురిపించిన సీఎం ప్రతి రైతు కుటుంబానికి 9వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కేంద్రం సాయంతో కలిపి మొత్తం 15వేల రూపాయలు అందించనున్నట్లు తెలిపారు. తాజా నిర్ణయంతో దాదాపు 54లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.

రైతులపై మరోసారి ఏపీ సర్కార్‌ వరాల జల్లు కురిపించింది. చిన్న, సన్నకారు రైతులకు మేలు చేకూర్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి నేరుగా 9వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్రం ఇచ్చే 6వేల సాయంతో కలిపి మొత్తం 15వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అలాగే ఐదెకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు 10వేలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం సాయం అందించనుంది. ఎన్నికలకు ముందే మొదటి విడతగా రైతుల ఖాతాల్లో 4వేలు జమ చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

ఇక నేటినుంచి సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కావాలని పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించినట్లు మంత్రి సోమిరెడ్డి తెలిపారు. ఎన్నికల కోసం సీనియర్లతో స్ట్రాటజిక్ కమిటీ వేయాలని తీర్మానించినట్లు తెలిపారు. ఇక ఎన్నికల షెడ్యూల్‌ రిలీజ్‌కి ముందే అభ్యర్ధుల తొలి జాబితా ప్రకటించనున్నట్టు సోమిరెడ్డి వెల్లడించారు. తొలి జాబితాలోనే మాగ్జిమమ్‌అభ్యర్ధులందరినీ ప్రకటించడం జరుగుతుందని, కేవలం కొన్ని స్థానాలకు మాత్రమే ఎన్నికల షెడ్యూల్ తర్వాత అనౌన్స్ చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో దాదాపు 54లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఎన్నికలకు ముందే మొదటి విడతగా రైతుల ఖాతాల్లో 4వేలు జమ చేయనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories