ఒంగోలులో ఉద్రిక్తత: టీడీపీ - వైసీపీ పోటాపోటీ ఆందోళనలు

ఒంగోలులో ఉద్రిక్తత: టీడీపీ - వైసీపీ పోటాపోటీ ఆందోళనలు
x
Highlights

ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ కూడలి దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసులు రెడ్డి రాక సందర్భంగా వైసీపీ,...

ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ కూడలి దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసులు రెడ్డి రాక సందర్భంగా వైసీపీ, టీడీపీ వర్గాలు భారీగా మొహరించాయి. కమ్మవారిపాలెంకు బాలినేని శ్రీనివాసులు రెడ్డి రాకను నిరసిస్తూ టీడీపీ మహిళా నేతలు రోడ్డుపై బైఠాయించారు. బాలినేనికి స్వాగతం పలికేందుకు వచ్చిన వైసీపీ కార్యకర్తలు పోటీగా నినాదాలు చేశారు. ఇరు పార్టీల నాయకులు రాళ్లు రువ్వుకున్నారారు. వైసీపీ కార్యకర్త పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. దీంతో ఆందోళన కారులపై పోలీసులు లాఠీఛార్జి జరిపారు. పోలీసులపై కూడా కార్యకర్తలు తిరగబడ్డారు. ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి.

ఒంగోలు కమ్మవారిపాలెంలో వైసీపీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం వివాదానికి కేంద్ర బిందువయ్యింది. వైసీపీలో చేరికల నిమిత్తం కమ్మపాలెం వెళ్తున్న వైసీపీ నేత బాలినేని శ్రీనివాసులురెడ్డిని టీడీపీ నేత దామచర్ల జనార్దన్ వర్గీయులు అడ్డుకున్నారు. కమ్మపాలెంలోకి వైసీపీని అనుమతించేది లేదంటూ కాలనీ ఎంట్రన్స్‌లో భైఠాయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories