Top
logo

సీబీఐ వ్యవహారంలో మరో ట్విస్ట్

సీబీఐ వ్యవహారంలో మరో ట్విస్ట్
X
Highlights

సీబీఐ వ్యవహారంలో మరో ఘటన చోటుచేసుకుంది. తాత్కాలిక డైరెక్టర్‌గా మన్యం నాగేశ్వరరావు నియమించడాన్ని సవాల్ చేస్తూ...

సీబీఐ వ్యవహారంలో మరో ఘటన చోటుచేసుకుంది. తాత్కాలిక డైరెక్టర్‌గా మన్యం నాగేశ్వరరావు నియమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ విచారణ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తప్పుకున్నారు. హైపర్ కమిటీ ద్వారా నాగేశ్వరరావు నియామకం జరగలేదంటూ కామన్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సీజేఐ ఈ కేసు విచారణను మరో ధర్మాసనానికి బదిలీ చేశారు. దీంతో ఈ నెల 24న జస్టిస్ సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు విచారణ రానుంది.

Next Story