అగస్టా వెస్ట్ ల్యాండ్ కేసులో కొత్త మలుపు

అగస్టా వెస్ట్ ల్యాండ్ కేసులో కొత్త మలుపు
x
Highlights

అగస్టా వెస్ట్ ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణం కేసు కొత్త మలుపు తిరిగింది. 3,600 కోట్ల ఈ కుంభకోణంలో మధ్యవర్తి క్రిస్టియన్ మైకేల్‌ను ఈడీ విచారించగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను వెల్లడించారు. క్రిస్టియన్ మైకేల్ వాంగ్మూలాన్ని పాటియాలా హౌజ్ కోర్టుకు ఈడీ సమర్పించింది. పాటియాలా కోర్టు క్రిస్టియన్ మిషెల్ కు 7 రోజుల పాటు కస్టడీ విధించింది.

అగస్టా వెస్ట్ ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణం కేసు కొత్త మలుపు తిరిగింది. 3,600 కోట్ల ఈ కుంభకోణంలో మధ్యవర్తి క్రిస్టియన్ మైకేల్‌ను ఈడీ విచారించగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను వెల్లడించారు. క్రిస్టియన్ మైకేల్ వాంగ్మూలాన్ని పాటియాలా హౌజ్ కోర్టుకు ఈడీ సమర్పించింది. పాటియాలా కోర్టు క్రిస్టియన్ మిషెల్ కు 7 రోజుల పాటు కస్టడీ విధించింది. అగస్టా వెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణంలో మధ్యవర్తి క్రిస్టియన్ మైకేల్‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారత్‌కు డిసెంబర్ మొదటి వారంలో అప్పగించింది. అప్పటి నుంచి అధికారులు వివిధ అంశాలపై మైకేల్‌ను విచారిస్తున్నారు. తాజాగా క్రిస్టియన్ మైకెల్ సోనియా గాంధీ పేరు వెల్లడించినట్టు ఈడీ పటియాలా కోర్టుకు తెలిపింది. అయితే ఏ విషయంలో సోనియా గాంధీ ప్రస్తావన వచ్చిందన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు.

తాజా విచారణలో సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేరును సైతం క్రిస్టియన్ మైకెల్ ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ శనివారం పటియాలా కోర్టుకు తెలియజేసింది.2010లో యూపీఏ హయాంలో జరిగిన అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ కుంభకోణంలో క్రిస్టియన్ మైకెల్ మధ్యవర్తిగా వ్యవహరించాడన్న ఆరోపణలున్నాయి. ఈ ఒప్పందం కుదిర్చినందుకు అగస్టా వెస్ట్‌ల్యాండ్ సంస్థ నుంచి క్రిస్టియన్ మిషెల్‌ 225కోట్లు అందుకున్నారని ఆరోపిస్తూ ఈడీ 2016 జూన్‌లో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. 2010లో యూపీఏ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మాజీ ప్రధానులు, ఇతర వీవీఐపీలు ఉపయోగించేందుకు 12 లగ్జరీ హెలీకాప్టర్లు కొనుగోలు చేయాలి. ఇందుకోసం ఇటలీకి చెందిన ఆంగ్లో-ఇటాలియన్ హెలికాప్టర్ల తయారీ కంపెనీ అగస్టా వెస్ట్‌ల్యాండ్‌‌తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ ఒప్పందాన్ని వెస్ట్ ల్యాండ్ సంస్థకు అప్పగించేందుకు క్రిస్టియన్ మైకెల్‌ మధ్యవర్తిత్వం నెరిపి ముడుపులు తీసుకున్నాడన్న ఆరోపణలున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories