logo

పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు...వాళ్ల వల్లే చిరంజీవి బలహీనుడయ్యారు...

జనసేనాని పవన్ కల్యాణ్‌ ప్రస్తుత రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లాల వారీగా పార్టీ నేతలతో సమావేశమవుతూ జనసైనికులను ఎన్నికలకు సమాయత్తం చేస్తోన్న పవన్ కల్యాణ్‌ రాజకీయాలు వ్యాపారంగా మారిపోయాయంటూ ఆవేదన వ్యక్తంచేశారు.

Pawan KalyanPawan Kalyan

జనసేనాని పవన్ కల్యాణ్‌ ప్రస్తుత రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లాల వారీగా పార్టీ నేతలతో సమావేశమవుతూ జనసైనికులను ఎన్నికలకు సమాయత్తం చేస్తోన్న పవన్ కల్యాణ్‌ రాజకీయాలు వ్యాపారంగా మారిపోయాయంటూ ఆవేదన వ్యక్తంచేశారు. రాజకీయాలు చేయాలన్నా, ఎన్నికల్లో పోటీ చేయాలన్నా వేల కోట్లు కావాలంటున్నారని వ్యాఖ్యానించారు. ప్రజారాజ్యం ఏర్పాటులో తాను బలమైన పాత్ర పోషించానన్న జనసేనాని పీఆర్పీ ఉండి ఉంటే సామాజిక న్యాయం జరిగి ఉండేదన్నారు. ఓపిక లేని నాయకులు చేరడం వల్ల అవకాశం చేజారిందన్నారు. పీఆర్పీలో చేరిన నేతలు పదవీ వ్యామోహంతో బలమైన చిరంజీవిని బలహీనుడిగా మార్చేశారని విమర్శించారు. ప్రతికూల పరిస్థితుల్లో జనసేనను స్థాపించానన్న పవన్ కల్యాణ్‌ వచ్చే ఎన్నికల్లో 60శాతం టికెట్లు కొత్తవారికే ఇస్తానన్నారు.

లైవ్ టీవి

Share it
Top