Top
logo

వెంటాడుతున్న చిరుత భయం

వెంటాడుతున్న చిరుత భయం
Highlights

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలో చిరుత పులి కలకలం రేగింది.

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలో చిరుత పులి కలకలం రేగింది. మేకల మందపై దాడి చేసి ఓ మేకను తినేసింది. గత వారం రోజుల నుంచి కొత్తపల్లి శివార్లలో సంచరిస్తున్న చిరుత ఇప్పటివరకు నాలుగు మేకలను చంపేసింది. భయాందోళన చెందిన గ్రామస్తులు అటవీశాఖకు ఫిర్యాదు చేశారు. పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారుల చర్యలు తీసుకుంటున్నారు. మాడ్గలు-యాచారం మండలాల సరిహద్దులోని తాడిపర్తి నుండి మాల్ వరకు 10కిలో మీటర్ల వరకు పెద్ద గుట్టలు, దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. ఇక చిరుత పులి రాత్రి సమయం అదునుగా చేసుకొని మేకల మందపై దాడి చేసి తెల్లవారే సరికే మళ్లీ గుట్టల్లోకి చేరుకుంటొంది. ఇక రాత్రి సమయంలోనే అంటే పగలు కూడా అటవీ ప్రాంతంలో వ్యవసాయ పోలాలకు వెళ్లాలంటేనే రైతులు, కూలీలు జంకుతున్నారు.

Next Story