నేడు చంద్రబాబు నివాసంలో టీడీఎల్పీ సమావేశం

నేడు చంద్రబాబు నివాసంలో టీడీఎల్పీ సమావేశం
x
Highlights

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమిపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిన్న ముఖ్య నేతలతో సమావేశమైన సంగతి తెలిసిందే. పార్టీని ఏవిధంగా బలోపేతం...

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమిపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిన్న ముఖ్య నేతలతో సమావేశమైన సంగతి తెలిసిందే. పార్టీని ఏవిధంగా బలోపేతం చేయాలి అనే దానిపై ఆయన పార్టీ నేతలతో చర్చించినట్లు సమాచారం. ఇకపోతే రేపటి నుంచి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీడీఎల్పీ సమావేశం కానుంది. నేటి ఉదయం 11 గంటలకు తన నివాసంలో ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశం అవుతున్నారు. ఈ సందర్భంగా సమావేశాల్లో ఏ ఏ అంశాలపై చర్చించాలి ఏలా వ్యవహరించాలనే దానిపై ఎమ్మెల్యేలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే సాయంత్రం ఎమ్మెల్సీలు, రేపు ఉదయం ఎంపీలతో చంద్రబాబు సమావేశం అవుతారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories