జ‌గ‌న్‌పైన సానుభూతి..కొత్త ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం: టీడీఎల్పీ నేత‌గా చంద్ర‌బాబు..

జ‌గ‌న్‌పైన సానుభూతి..కొత్త ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం: టీడీఎల్పీ నేత‌గా చంద్ర‌బాబు..
x
Highlights

టీడీఎల్పీ నేతగా చంద్రబాబును పార్టీనేతలు ఎన్నుకున్నారు. ఓడిపోయామని చింతించాల్సిన అవసరం లేదని పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చంద్రబాబు...

టీడీఎల్పీ నేతగా చంద్రబాబును పార్టీనేతలు ఎన్నుకున్నారు. ఓడిపోయామని చింతించాల్సిన అవసరం లేదని పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. సభలో ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన వ్యూహం, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. టీడీపీ శాసనసభా పక్ష నేతగా చంద్రబాబును మరోసారి ఎన్నుకున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో టీడీపీ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. అసెంబ్లీ, శాసన మండలిలో టీడీపీ పక్ష నేతలెవరన్నదానిపై చర్చించారు. అసెంబ్లీలో టీడీపీ పక్ష నేతగా అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ పేర్లను పరిశీలించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉండేందుకు చంద్రబాబు ఏమాత్రం ఆసక్తిగా లేరని తెలిసినా మరోసారి చంద్రబాబే తమ నేతగా ఉండాలని ఎమ్మెల్యేలంతా కోరడంతో వారి కోరిక మేరకు మరోసారి టీడీఎల్పీ నేతగా ఉండేందుకు చంద్రబాబు అంగీకరించారు.

కొత్త ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దామన్నారు చంద్రబాబు. అన్నింటిని నిశితంగా గమనించిన తర్వాతే స్పందిద్దామని తెలిపారు. పాత, కొత్త కలబోతతో టీడీపీ వాణిని అసెంబ్లీలో బలంగా వినిపించాలని కోరారు. ఆయా నియోజకవర్గాల సమస్యలను సభలో ప్రస్తావించాలని సూచించారు చంద్రబాబు. జగన్ పట్ల ఉన్న సానుభూతితోనే ఎన్నికల్లో వైసీపీ గెలిచిందన్నారు. టీడీఎల్పీలో ఉప నేతలు, విప్ పదవులు ఎవరికివ్వాలనే నిర్ణయాన్ని చంద్రబాబుకే అప్పగించామని ఎమ్మెల్యే చినరాజప్ప అన్నారు. ఎన్నికల్లో ఓటమిపై విశ్లేషణ చేసుకుంటామని చెప్పారు. టీడీఎల్పీ భేటీ తర్వాత చంద్రబాబునాయుడు ఎంపీలతో సమావేశమయ్యారు. టీడీపీ పార్లమెంటరీ పక్షనేతగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ను పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. లోక్‌సభలో పార్టీనేతగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, రాజ్యసభలో నేతగా ఎంపీ సుజనా చౌదరి వ్యవహరించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories