ఇంటర్ చదివిన వారికి బంపర్ ఆఫర్ ప్రకటించిన చంద్రబాబు..

ఇంటర్ చదివిన వారికి బంపర్ ఆఫర్ ప్రకటించిన చంద్రబాబు..
x
Highlights

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిరుద్యోగ యువతకు తీపి కబురు అందించాడు. ఎన్నికల హామీలో భాగంగా డిగ్రీ పూర్తిచేసిన...

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిరుద్యోగ యువతకు తీపి కబురు అందించాడు. ఎన్నికల హామీలో భాగంగా డిగ్రీ పూర్తిచేసిన వారికి నిరుద్యోగ భృతి ఇస్తామని, రాబోయే రోజుల్లో ఇంటర్ చదివిన వారికి కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాగా ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ రద్దు, గాలేరు, నగరి, సోమశిల, స్వర్ణముఖి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీలో దాదాపు 12 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్టు అంచనా. ఏపీ సర్కార్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి యువనేస్తం వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకున్నవారికి నిరుద్యోగ భృతి అందిస్తున్నారు. నెలకు రూ.2000 నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. ఇప్పటి వరకు డిగ్రీ, పిజీ వల్లకే వర్తించిన నిరుద్యోగ భృతి ఇకపై ఇంటర్ చదివిన వారికి కూడా వర్తింపజేయాలనుకుంటున్నట్టు చంద్రబాబు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories