బాబు సంక్రాంతి సందడి...పిల్లలతో పోటీపడి ఆడిన సీఎం చంద్రబాబు

Sankranthi
x
Sankranthi
Highlights

ఎప్పుడు సమీక్షలు, సమావేశాలు, టెలికాన్ఫరెన్స్ లతో బిజీగా ఉండే బాబు ప్రకాశం జిల్లా టూర్ లో మాత్రం తన స్టైల్ కి భిన్నంగా చిన్నపిల్లాడిలా మారిపోయారు. రామాయపట్నంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి స్టాల్స్ ను పరిశీలించిన సీఎం విద్యార్థులు, చిన్నారులతో కలిసి ఆడారు.

ఎప్పుడు సమీక్షలు, సమావేశాలు, టెలికాన్ఫరెన్స్ లతో బిజీగా ఉండే బాబు ప్రకాశం జిల్లా టూర్ లో మాత్రం తన స్టైల్ కి భిన్నంగా చిన్నపిల్లాడిలా మారిపోయారు. రామాయపట్నంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి స్టాల్స్ ను పరిశీలించిన సీఎం విద్యార్థులు, చిన్నారులతో కలిసి ఆడారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న బాబు ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపించారు.

సంక్రాంతి సంబరాల్లో భాగంగా గ్రామీణ, సాంప్రదాయ క్రీడాలను ప్రారంభించిన చంద్రబాబు తన చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. అక్కడి పిల్లలను, క్రీడాకారులను చూసి ఆయన కూడా ఒక్కసారిగా పిల్లడిలా మారిపోయారు. వారితో కలిసి పోటీపడ్డారు. ఒకవైపు పాలనా బాధ్యతలు మరోవైపు, పార్టీ కార్యక్రమాలతో ఎప్పుడు బిజీగా ఉండే చంద్రబాబు సంక్రాంతి సంబరాల్లో మాత్రం కొద్దిసేపు సరదాగా కనిపించారు. అర్చరీ గేమ్స్ ను ప్రారంభించిన సీఎం విల్లు ఎక్కుపెట్టారు. పిల్లలతో పోటీపడి యారోను వదిలారు.

చిన్నారులతో కలిసి పలు ఆటల్లో పాల్గొన్న బాబు వారిలో ఉత్సాహాన్ని నింపారు. వాలీబాల్ కోర్టులోకి దిగిన చంద్రబాబు అక్కడి ప్లేయర్స్ తో కలిసి, కాసేపు తాను కూడా ఆడారు. ఇక గ్రామీణా క్రీడలైన కర్రా బిళ్ల, గోలీలాటలను సైతం బాబు వదలలేదు. పిల్లలతో కలిసి గోలీలాట ఆడారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ బాబు పాల్గొన్నారు. విద్యార్ధులతో కలిసి కోలాటం ఆడారు. చిడతలు వాయించారు.

హరిదాసుల సందడి, గంగిరెడ్ల విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు. రంగు రంగుల రంగవల్లెలు ముగ్గులో గొబ్బెమ్మలను నిలిపి, సాంప్రదాయ ఆట, పాటలతో ఆకట్టుకున్న మహిళలను బాబు అభినందించారు. మొత్తంగా ఎప్పుడు పని ఒత్తిడితో బిజీ బిజీగా ఉండే బాబు ప్రకాశం జిల్లా టూర్ మాత్రం ఉత్సహాంగా, సరదాగా కనిపించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories