logo

పదో శ్వేతపత్రం విడుదల చేసిన ఏపీ సీఎం

ఆర్థిక రంగంపై సీఎం చంద్రబాబు పదో శ్వేతపత్రం విడుదల చేశారు. షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన ఇంతవరకు జరగలేదని, ఏపీని కేంద్రం అణగదొక్కడానికి ప్రయత్నించడమే దుర్మార్గమని విమర్శించారు.

పదో శ్వేతపత్రం విడుదల చేసిన ఏపీ సీఎం

వివిధ రంగాలలో నాలుగున్నరేళ్లుగా సాధించిన ప్రగతిని వివరిస్తూ పది రోజులుగా శ్వేతపత్రాలను విడుదల చేస్తున్న ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సరపు తొలి రోజున రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 సంస్థల విభజన ఇంతవరకు జరగలేదని అది జరిగివుంటే కొంతవరకు వెసులుబాటు వచ్చేది రెండు రాష్ట్రాల మధ్య సామరస్య వాతావరణం ఉండేదని సీెఎం చంద్రబాబు అన్నారు. ఆర్థిక రంగంపై సీఎం చంద్రబాబు పదో శ్వేతపత్రం విడుదల చేశారు. షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన ఇంతవరకు జరగలేదని, ఏపీని కేంద్రం అణగదొక్కడానికి ప్రయత్నించడమే దుర్మార్గమని విమర్శించారు. ఏపీలో 10.52 శాతం వృద్ధిరేటు ఉంటే తెలంగాణలో 9.7 శాతమే ఉందని చంద్రబాబు చెప్పారు. నాలుగేళ్లలో వ్యవసాయం, అనుబంధ రంగాల వృద్ధి రెట్టింపు అయిందన్నారు. ఏపీలో కుట్ర రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఏపీలో బలహీనమైన ప్రభుత్వం ఉంటే వాళ్లు పనిచేయకపోయినా గొప్పగా చెప్పుకోవచ్చని అనుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు. వాళ్లు చెప్పినట్టు వినే ప్రభుత్వం రావాలని భావిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

లైవ్ టీవి

Share it
Top