మరోసారి అధికారమే లక్ష్యంగా చంద్రబాబు జిల్లాల పర్యటన..

మరోసారి అధికారమే లక్ష్యంగా చంద్రబాబు జిల్లాల పర్యటన..
x
Highlights

సమీక్షలు పూర్తయ్యాయి. అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చింది. ఇక మిగిలింది ప్రచారమే. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన వెంటనే ఏపీ సీఎం చంద్రబాబు జిల్లాల పర్యటన...

సమీక్షలు పూర్తయ్యాయి. అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చింది. ఇక మిగిలింది ప్రచారమే. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన వెంటనే ఏపీ సీఎం చంద్రబాబు జిల్లాల పర్యటన వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. బహిరంగ సభలు, రోడ్‌ షోలతో ప్రచారాన్ని ముమ్మరం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేసేలా రూట్‌ మ్యాప్‌ను రెడీ చేశారు.

ఎన్నికల సమీపిస్తున్న వేళ ఏపీ సీఎం చంద్రబాబు అభ్యర్థుల ఖరారుపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. గత 15 రోజులుగా రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన సమీక్షలు నిర్వహించిన చంద్రబాబు అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల ఎంపికను పూర్తి చేశారు. ఇప్పటివరకు 120 కి పైగా ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల తర్వాత పూర్తిస్థాయి జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నెల 11 న సాధారణ ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే అవకాశం ఉండటంతో 12 న లేదా 14 న అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.

ఇక ప్రచారపర్వంలోకి అడుగుపెట్టేందుకు ఈ నెల 16 న ముహూర్తం ఖరారు చేశారు. జిల్లాల వారీగా బహిరంగ సభలు, రోడ్‌ షోలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు ప్రతి నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు. ఈసారి తనను చూసి ఓటేయ్యాలని చంద్రబాబు ప్రజలను కోరతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక సమీక్షా సమావేశాల్లో పార్టీ నాయకులకు చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు. సంక్షేమ పథకాలను జనంలోకి బాగా తీసుకెళ్లాలని ప్రతి ఇంటిలో లబ్ధిదారులున్నారు కాబట్టీ జాగ్రత్తగా ఎన్నికల ప్రచారం నిర్వహించాలని సూచించారు. మరోసారి అధికారమే లక్ష్యంగా చంద్రబాబు జిల్లాల పర్యటన ఉండబోతోందని పార్టీ వర్గాలు చెబుతున్నారు. ప్రతిపక్ష పార్టీపై విమర్శలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునేలా టూర్‌ సాగనుందని వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories