30 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ

30 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ
x
Highlights

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన 36 అడుగుల భారీ ఎన్టీఆర్ విగ్రహం, ఎన్టీఆర్ పార్క్, వావిలాల ఘాట్ ను చంద్రబాబు ప్రారంభించారు.

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన 36 అడుగుల భారీ ఎన్టీఆర్ విగ్రహం, ఎన్టీఆర్ పార్క్, వావిలాల ఘాట్ ను చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సత్తెనపల్లిలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు చంద్రబాబు. ఎన్టీఆర్‌ తెలుగువారికి ఇచ్చిన శాశ్వత కానుక తెలుగుదేశం పార్టీయేనని చంద్రబాబు అన్నారు.తెలుగు జాతి ఆత్మగౌరం కోసం పోరాడిన వ్యక్తి ఎన్టీరామారావు అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎన్టీఆర్ ఏ పని చేసిన బ్రహ్మాండంగా చేశారని కొనియాడారు. ఉత్తమ విద్యార్ధిగా ఆదర్శ విద్యార్ధిగా. గొప్ప కలాకారుడిగా, సంఘసేవకుడిగా పరిపాలన దక్షిడిగా కొనసాగారన్నారు. ఆయనకు మరెవరు సాటిరారన్నారు . ఎన్టీఆర్ స్పూర్తిగా తీసుకని ప్రజాసేవలో పునరంకితం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. చరిత్ర ఉన్నంత కాలం ప్రజల గుండెల్లో ఎన్టీరామారావు నిలిచిపోతారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు.

ఎన్టీఆర్‌ ఒక మహానాయకుడు, యుగపురుషుడు అని కొనియాడారు చంద్రబాబు. సత్తెనపల్లికి వన్నె తెచ్చేలా తారకరామసాగర్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌లో ఎన్టీఆర్‌ హయాంలో బుద్ధుడి విగ్రహం ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు అదే తరహాలో సత్తెనపల్లిలో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటైందన్నారు. తారకరామ సాగర్, ఎన్టీఆర్ గార్డెన్ ఎక్కడ లేని విధంగా తీర్చిదిద్దారన్నారు చంద్రబాబు. ఎన్టీఆర్ అందాన్ని శిలారూపంలో తయారు చేయడం ఒక గొప్ప చరిత్రగా అభివర్ణించారు. చెరువు చుట్టూ నిర్మించిన వాకింగ్ పార్క్ సుందరంగా ఉంది. ఎన్టీరామారావును చూసుకుని ఇంటికి వెళ్తే ఆరోజు తిరుగులేని విజయం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ కోడెలతో కలిసి చంద్రబాబు తారకరామ సాగర్‌లో బోటులో విహరించారు. సత్తెనపల్లి మున్సిపల్ చైర్మన్ రామస్వామిస స్థానిక పార్టీ నేతలు గజమాల,శాలువలు, మెమెంటోలతో చంద్రబాబును సత్కరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories