Top
logo

ముస్లింలను బాధపెట్టేందుకే మోడీ ట్రిపుల్ తలాఖ్ చట్టం: చంద్రబాబు

ముస్లింలను బాధపెట్టేందుకే మోడీ ట్రిపుల్ తలాఖ్ చట్టం: చంద్రబాబు
X
Highlights

ముస్లింలను బాధపెట్టేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ట్రిపుల్ తలాఖ్ చట్టం తీసుకువచ్చారని టీడీపీ అధినేత...

ముస్లింలను బాధపెట్టేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ట్రిపుల్ తలాఖ్ చట్టం తీసుకువచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ట్రిపుల్ తలాఖ్ విషయంలో వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. కడపలో జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాతో కలిసి చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గోద్రా అల్లర్ల విషయంలో ప్రధాని మోడీ రాజీనామాకు డిమాండ్ చేసిన విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు గుర్తు చేశారు. నాపై కోపంతో నరేంద్ర మోడీ ఏపీ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని నారా చంద్రబాబు ఆరోపించారు.

Next Story