కొడాలి నానిని దేవినేని వారసుడు ఓడిస్తాడా ?

కొడాలి నానిని దేవినేని వారసుడు ఓడిస్తాడా ?
x
Highlights

ఏపీలో ఎన్నికల నగారా మోగించడంతో మహాయుద్దాన్నే తలపిస్తోంది. ఇప్పటికే ఆయా పార్టీ అధినేతలు అభ్యర్థులను కూడా ప్రకటించారు. కాగా ఎన్నికల రణరంగంలో విజేతలేవరో...

ఏపీలో ఎన్నికల నగారా మోగించడంతో మహాయుద్దాన్నే తలపిస్తోంది. ఇప్పటికే ఆయా పార్టీ అధినేతలు అభ్యర్థులను కూడా ప్రకటించారు. కాగా ఎన్నికల రణరంగంలో విజేతలేవరో పరజితులేవరో మరో నెల రోజుల్లో తెలియనుంది. ఇప్పటికే ఇటు అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటలు పెలుతున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవలని వూహ్యాలకు ప్రతివూహ్యాలు వేస్తుంటారు. ఇక వైసీపీలోని కొందరు ముఖ్యనేతలను ఓడించడమే లక్ష్యంగా పక్కా ప్రణాళిక వేస్తోంది అధికార టీడీపీ, ఇక ఆ జాబితాలో గుడివాడ వైసీపీ శాసనసభ్యుడు కొడాలి నాని కూడా ఉన్నారు. రెండుసార్లు తెలుగుదేశం పార్టీ నుండి గెలిచిన కొడాలి నాని సీఎం చంద్రబాబును తీవ్రంగా విమర్శించి వైసీపీ గూటికి చేరుకుని వైసీపీ తరపున గుడివాడలో మరోసారి ఎమ్మెల్యేగా గెలిపొందారు నాని. గడిచిన ఐదేళ్లలోనూ టీడీపీకి వ్యతిరేకంగానే పోరాడారు. అసెంబ్లీలోనూ టీడీపీని విమర్శించడంలో నాని తనవంతు పాత్ర పోషించారు.అయితే ఈ2019 ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా గుడివాడలో కొడాలి నానిని ఓడింయి అసెంబ్లీ ముఖం కూడా చూడకుండా యత్నం చేస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. నానికి పోటీగా రంగంలోకి దేవినేని అవినాష్‌ను దింపుతున్నారు. పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించిన అవినాష్ గుడివాడలో కొడాలి నానిని రాజకీయంగా ఢీ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. అయితే కొడాలి నానిని ఢీకొట్టే సత్తా అవివాష్ కి ఉందా? ఒకవేళ ఎన్నికల రణరంగంలో కొడాలి నానిని ఢీకొట్టేందుకు అవినాష్ ఎలాంటి అస్త్రాలు ఉపయోగించబోతున్నారు. మాటతో తూటలతో పెల్చేసత్తా ఉందా? 2019 ఎన్నికల్లో నానినిపై నెగ్గుతారా? 2019 ఎన్నికల్లో గుడివాడలో రింగ్ తిప్పేది ఎవరు? రింగ్ నుండి తప్పుకునేది ఎవరు? ఎవరి బలలు ఎంత? ఎవరు బలహీనతలను బట్టి రంగంలో దిగుతారు? మొత్తానికి గుడివాడ ప్రజలు పట్టంకట్టేది ఎవరికి? నానినికి సై అంటారా? లేక అవినాష్‌కి నయ్య్ అంటారా? చూడాలి మరి కొద్ది రోజుల్లో ఎవరు విజేతగా నిలబడుతారో? దేవినేని అవినాష్‌ను బరిలోకి దింపేందుకు వీలుగా అక్కడ టికెట్ ఆశిస్తున్న రావి వెంకటేశ్వరరావుకు ఎమ్మెల్సీ పదవి, యలపర్తి శ్రీనివాసరావుకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తామని చంద్రబాబు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories