ఈసీపై సీఈసీకి చంద్రబాబు ఫిర్యాదు.. 18 పేజీల లేఖ

ఈసీపై సీఈసీకి చంద్రబాబు ఫిర్యాదు.. 18 పేజీల లేఖ
x
Highlights

ఏపీ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం వైఫల్యం చెందిందని ఆరోపిస్తూ చంద్రబాబు సీఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. 13 అంశాలతో 18 పేజీల లేఖ రాష్ట్రంలో...

ఏపీ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం వైఫల్యం చెందిందని ఆరోపిస్తూ చంద్రబాబు సీఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. 13 అంశాలతో 18 పేజీల లేఖ రాష్ట్రంలో వ్యవస్థాపరంగా ఎన్నికల నిర్వహణలో పూర్తిగా విఫలమైనందునే ఈసీఐను ఆశ్రయిస్తున్నట్లు లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ ఇన్ని అరాచకాలను చూడలేదన్నారు చంద్రబాబు. ఎన్నికలు జరిగిన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన చంద్రబాబు. జాతీయస్థాయిలో ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషనర్ అరోరాను కలిసిన బాబు ఏపీలో పోలింగ్ జరిగిన తీరుపై ఫిర్యాదు చేశారు.

సీఈసీతో సుమారు గంటన్నరపాటు సమావేశమైన చంద్రబాబు పోలింగ్ నిర్వహణలో లోపాలు, ఈవీఎంల మొరాయింపులపై కంప్లైంట్ ఇచ్చారు. ఏపీలో అడ్మినిస్ట్రేషన్‌ను నిర్వీర్యం చేయాలని చూశారని చంద్రబాబు ఆరోపించారు. అభ్యర్థులు, స్పీకర్‌పై దాడులు చేస్తూ, ఆంధ్రప్రదేశ్‌ని రావణకాష్టంగా మార్చాలనుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ విఫలమైందని, ఓటర్లు ఈసీకి భిక్షగాళ్లలా కనిపిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఈవీఎంలపై ప్రతి ఒక్కరికి అనుమానాలు ఉన్నాయని తెలిపారు. వీవీప్యాట్లను లెక్కించడానికి 6రోజులు పడుతుందని సుప్రీంకు ఈసీ ఎందుకు చెప్పిందని చంద్రబాబు ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories